News March 30, 2024
విరాట్ ఒక్కడే ఎంతని ఆడగలడు: గవాస్కర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ‘విరాట్ కోహ్లీ ఎంతని ఆడతాడో మీరే చెప్పండి. ఎవరైనా అతనితో నిలబడాలి. KKRతో మ్యాచులో కూడా ఏ ఆటగాడైనా అతనికి మద్దతిస్తే అతను కచ్చితంగా 83కి బదులు 120 పరుగులు చేసి ఉండేవాడు. కాబట్టి ఇది టీమ్ అంతా కలిసి ఆడాల్సిన ఆట. ఈరోజు ఏ ఒక్క ప్లేయర్ అతనికి సపోర్ట్ చేయలేదు’ అని గవాస్కర్ అన్నారు.
Similar News
News February 8, 2026
IAFలో అగ్నివీర్ వాయు పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 8, 2026
కనకాంబరం సాగుకు అనువైన రకాలు

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.
News February 8, 2026
భాను సప్తమి వ్రతం నేడు ఎందుకు ఆచరిస్తారంటే?

నేడు భాను సప్తమి వ్రతం ఆచరిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వ్రతం చేయాలని సూచిస్తున్నారు. జాతకంలో సూర్య దోషం ఉన్నవారు ఈ వ్రతం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం, తేజస్సు పొందుతారట. సూర్యుడు ‘ఆరోగ్య ప్రదాత’ కావడంతో, భాను సప్తమి నాడు చేసే పూజ, అర్ఘ్యంతో మానసిక ప్రశాంతత, సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.


