News April 29, 2024
భూమిపై నదుల్లో ఎంత నీరు ప్రవహిస్తోంది?

భూమిపై 70% నీరున్నా పలు దేశాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంచినీరుండే నదుల్లో ఎంత నీరు ప్రవహిస్తోందనే విషయంలో సైంటిస్టులు ఓ అంచనా వేశారు. 1980-2009 మధ్య 539 క్యూబిక్ మైళ్ల పరిమాణంలో నీరు ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే.. దాదాపు 900 మిలియన్ల ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ నింపగలిగేంత నీరు నదుల్లో ప్రవహిస్తోందట. అయితే సముద్రాల్లో కలిసే నీటి విషయంలో కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు.
Similar News
News April 19, 2026
అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
News April 19, 2026
వీళ్లు ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగొద్దు!

ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగితే ఆయా అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి కడుపులో ఇబ్బంది కలగొచ్చు. ఒంట్లో నీరు చేరి వాపులు వచ్చే వారు కూడా వైద్యుల సలహా మేరకే నీటిని తీసుకోవాలి.
News April 19, 2026
హైకోర్టులో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్

AP హైకోర్టులో 300 ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇందులో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసర్ సబార్డినేట్, టైపిస్ట్ తదితర ఉద్యోగాలున్నాయి. పోస్టుల ఆధారంగా 7వ తరగతి/డిగ్రీ/బీటెక్, షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి. CBT, స్కిల్ ఆధారంగా ఎంపిక ఉండనుంది. పోస్టులను బట్టి నెల వేతనం రూ.20వేల-రూ.లక్షన్నర వరకు ఉంది. నోటిఫికేషన్, అప్లై చేయడానికి ఇక్కడ <


