News January 21, 2025

నకిలీ వెబ్ సైట్లను గుర్తించండిలా

image

☛ వెబ్‌సైట్ https://తో ప్రారంభం అవుతుంది. తర్వాత కంపెనీ నేమ్ ఉంటుంది. స్పెల్లింగ్‌లో మిస్టేక్స్ ఉంటే నకిలీదని అనుమానించాలి.
☛ సైట్ డొమైన్ చెక్ చేయాలి. సైట్ ఇటీవలే ప్రారంభించినట్లు ఉంటే నకిలీదయ్యే ఛాన్సుంది.
☛ అడ్రస్ బార్/URL వద్ద ప్యాడ్ లాక్‌పై క్లిక్ చేస్తే సైట్ info వస్తుంది.
నకిలీ సైట్లలో డేటాను ఎంటర్ చేసినప్పుడు డేటా చోరీపై హెచ్చరిస్తుంది.
☛ ప్రభుత్వ వెబ్ సైట్లకు చివరన gov.in అని ఉంటుంది.

Similar News

News February 13, 2025

పర్యాటకంలో 20 శాతం వృద్ధి ఉండాలి: సీఎం

image

AP: పర్యాటక రంగ అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందులో 20 శాతం వృద్ధి ఉండాలని సూచించారు. మెగా ప్రాజెక్టుగా శ్రీశైలం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి, విశాఖ, అమరావతి, రాజమండ్రిలో టూరిజం హబ్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్, క్రూయిజ్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు.

News February 13, 2025

పిల్లలకు థియేటర్ ఎంట్రీపై ఆంక్షలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

image

TG: రా.11 నుంచి ఉ.11 లోపు థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లల ప్రవేశంపై హైకోర్టు <<15284831>>ఆంక్షలు విధించడంపై<<>> అప్పీల్ పిటిషన్ దాఖలైంది. ఆ తీర్పుతో తాము నష్టపోతామని మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘం పేర్కొంది. అయితే సింగిల్ బెంచ్ వద్ద పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున అప్పీలుపై జోక్యం చేసుకోలేమని CJ బెంచ్ స్పష్టం చేసింది. ఆ పెండింగ్ పిటిషన్‌లోనే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

News February 13, 2025

తెలంగాణపై వివక్ష లేదు: నిర్మలా

image

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్న కాంగ్రెస్ MPల ఆరోపణలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ‘తెలంగాణకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ నోడ్ మంజూరు చేశాం. 2014 నుంచి TGలో 2605K.Mల హైవేలు నిర్మించాం. ఈ ఏడాది రైల్వేలో రూ.5337 కోట్లు కేటాయించాం. 5 వందేభారత్ రైళ్లు మంజూరు చేశాం. 2 లక్షల ఇళ్లు, 31 లక్షల మరుగుదొడ్లు, 38 లక్షల నల్లా కనెక్షన్లు అందించాం’ అని చెప్పారు.

error: Content is protected !!