News November 9, 2024
కెనడాకు వెళ్లిపోవడం ఎలా: Googleలో వెతుకుతున్న అమెరికన్లు

డొనాల్డ్ ట్రంప్ గెలిచాక గూగుల్‌లో ‘కెనడాకు వెళ్లిపోవడం ఎలా’ అనే సెర్చ్ టర్మ్ వాల్యూమ్ అమెరికాలో విపరీతంగా పెరిగింది. ఓట్ల లెక్కింపు రాత్రి 400% సెర్చెస్ పెరిగినట్టు గూగుల్ ట్రెండ్స్ డేటా ద్వారా తెలుస్తోంది. కమలా హారిస్‌కు ఎక్కువ మద్దతిచ్చిన వాషింగ్టన్ వంటి స్టేట్స్లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. ‘కెనడాకు వెళ్లాలంటే ఏం కావాలి’, ‘US నుంచి కెనడాకు వెళ్లడం’ వంటి కీవర్డ్స్ సెర్చ్ బాగా పెరిగింది.
Similar News
News November 28, 2025
హనుమాన్ చాలీసా భావం – 23

ఆపన తేజ సమ్హారో ఆపై|
తీనోం లోక హాంక తే కాంపై||
హనుమంతుడి తేజస్సు ఎంత శక్తిమంతమైనదంటే.. దానిని కేవలం ఆయనే మాత్రమే స్వయంగా నియంత్రించుకోగలడు. ఆయన పెట్టే ఒక్క కేకకు 3 లోకాలు సైతం భయంతో కంపించిపోతాయి. లోకాలను శాసించగల మహాశక్తిని కలిగిన ఆంజనేయుడు శాంతి స్వరూపుడు కూడా! ఆ అపారమైన శక్తిని మనం పూజించినా, కాపాడమని శరణు వేడినా.. తప్పక రక్షిస్తాడు. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 28, 2025
APPLY NOW: NCPORలో ఉద్యోగాలు

నేషనల్ సెంటర్ ఫర్ పోలార్&ఓషియన్ రీసెర్చ్(NCPOR) 5 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. జీతం నెలకు రూ.56వేలు+HRA చెల్లిస్తారు. వెబ్సైట్: https://ncpor.res.in/
News November 28, 2025
‘పుస్తకాల పండుగ’ మళ్లీ వచ్చేస్తోంది

పుస్తక ప్రియులకు గుడ్‌న్యూస్. DEC 19 నుంచి ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 38వ బుక్ ఫెయిర్ లోగోను ఆయన ఆవిష్కరించారు. NTR స్టేడియంలో DEC 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ఫెయిర్ జరగనుంది. ఎంతోమంది కవులు రాసిన పుస్తకాలు స్టాల్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. మీరూ బుక్ ఫెయిర్ కోసం ఎదురుచూస్తున్నారా? ఈ సారి ఏ పుస్తకం కొనాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.


