News November 9, 2024
కెనడాకు వెళ్లిపోవడం ఎలా: Googleలో వెతుకుతున్న అమెరికన్లు
డొనాల్డ్ ట్రంప్ గెలిచాక గూగుల్లో ‘కెనడాకు వెళ్లిపోవడం ఎలా’ అనే సెర్చ్ టర్మ్ వాల్యూమ్ అమెరికాలో విపరీతంగా పెరిగింది. ఓట్ల లెక్కింపు రాత్రి 400% సెర్చెస్ పెరిగినట్టు గూగుల్ ట్రెండ్స్ డేటా ద్వారా తెలుస్తోంది. కమలా హారిస్‌కు ఎక్కువ మద్దతిచ్చిన వాషింగ్టన్ వంటి స్టేట్స్‌లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. ‘కెనడాకు వెళ్లాలంటే ఏం కావాలి’, ‘US నుంచి కెనడాకు వెళ్లడం’ వంటి కీవర్డ్స్ సెర్చ్ బాగా పెరిగింది.
Similar News
News December 9, 2024
తెలంగాణ అసెంబ్లీ ఈనెల 16 వరకు వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 16కు వాయిదా పడ్డాయి. శాసన మండలిని కూడా 16వ తేదీ వరకు వాయిదా వేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో అసెంబ్లీ సమావేశాల తదుపరి కార్యకలాపాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
News December 9, 2024
విచిత్రం.. ఇక్కడ పడమరన సూర్యుడు ఉదయిస్తాడు!
సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమరన అస్తమించడం కామన్. అయితే, పడమరన ఉన్న పసిఫిక్ సముద్రంలో సూర్యుడు ఉదయించి తూర్పున ఉన్న అట్లాంటిక్ సముద్రంలో అస్తమించడం మీరెప్పుడైనా చూశారా? ఇలా చూడగలిగే ఏకైక ప్రదేశం పనామా. ఇది సెంట్రల్ అమెరికాలోని ఓ దేశం. ఇక్కడి ఎత్తైన ప్రదేశం వోల్కానో బారుపై నుంచి చూస్తే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు.
News December 9, 2024
‘పుష్ప-2’పై రోజా ప్రశంసలు
‘పుష్ప-2’ సినిమాపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఐకాన్ స్టార్.. మీ పుష్ప-2 చిత్రం అంచనాలకు మించింది. పుష్పతో తగ్గేదేలే అన్నారు. Pushpa2తో అస్సలు తగ్గేదేలే అనిపించారు. మా చిత్తూరు యాస వెండితెరపై పలికిన తీరు హాల్‌లో ఈలలు వేయిస్తోంది. మీ నటన అద్భుతం, యావత్ దేశాన్నే మీ మాస్ ఇమేజ్‌తో పుష్పా అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. వైల్డ్ ఫైర్ అని పూనకాలు పుట్టించారు’ అని ట్వీట్ చేశారు.