News September 17, 2024
ఆండ్రాయిడ్ డేటాని iOSలోకి ఇలా మార్చుకోండి

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో Move to iOS యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మీ ఐఫోన్లో యాప్స్ అండ్ డేటాలో Move Data from Android సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు వచ్చే కోడ్ను ఆండ్రాయిడ్ ఫోన్లో ఎంటర్ చేయాలి. తద్వారా ఐఫోన్ టెంపరరీ వైఫై నెట్వర్క్ను క్రియేట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఈ నెట్వర్క్లో జాయిన్ అవ్వాలి. అనంతరం డేటా టైప్ సెలక్ట్ చేసుకొని ఐఫోన్లోకి బదిలీ చేసుకోవచ్చు.
Similar News
News September 7, 2025
మెట్రో టెండర్ల గడువు పొడిగింపు

AP: విజయవాడ, విశాఖ మెట్రో టెండర్ల గడువు పొడిగించినట్లు AP మెట్రో రైల్ కార్పొరేషన్ MD రామకృష్ణారెడ్డి తెలిపారు. VJA మెట్రో టెండర్ల గడువు అక్టోబరు 14, విశాఖకు సంబంధించి అక్టోబరు 7వరకు పొడిగించామన్నారు. టెండర్ల ప్రీబిడ్ సమావేశంలో కాంట్రాక్ట్ సంస్థల నుంచి వినతులు రాగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విశాఖ మెట్రో ఫేజ్-1 కింద 46.23KM, VJA మెట్రో ఫేజ్-1లో 38KM నిర్మాణానికి టెండర్లు పిలిచామని చెప్పారు.
News September 7, 2025
ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్

భారత్ ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్లు విధించిన నేపథ్యంలో PM మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. US దిగుమతులపై 75% సుంకాలు విధించి ప్రధాని ధైర్యసాహసాలు చూపించాలన్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే దేశ ప్రజలు వెన్నంటే ఉంటారని తెలిపారు. అధిక పన్నులు విధించాలని, ఆ తర్వాత ట్రంప్ మనముందు మోకరిల్లుతారో లేదో చూడాలని సూచించారు. అంతేగాని US ముందు మోదీ ఎందుకు మోకరిల్లుతున్నారో అర్థం కావడంలేదన్నారు.
News September 7, 2025
నిమజ్జనంలో విషాదం.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

TG: వినాయకుడి నిమజ్జనం ఊరేగింపులో విషాదం చోటు చేసుకుంది. ఘట్కేసర్ ట్రాఫిక్ PSలో విధులు నిర్వహించే కానిస్టేబుల్ డేవిడ్(31) నిన్న మల్కాజ్గిరిలోని ఇంటికి వెళ్లారు. కాలనీలో గణేశ్ శోభాయాత్రలో డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.