News September 17, 2024

ఆండ్రాయిడ్ డేటాని iOSలోకి ఇలా మార్చుకోండి

image

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Move to iOS యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే మీ ఐఫోన్‌లో యాప్స్ అండ్ డేటాలో Move Data from Android సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు వ‌చ్చే కోడ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎంట‌ర్ చేయాలి. త‌ద్వారా ఐఫోన్ టెంప‌ర‌రీ వైఫై నెట్‌వ‌ర్క్‌ను క్రియేట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఈ నెట్‌వ‌ర్క్‌లో జాయిన్ అవ్వాలి. అనంత‌రం డేటా టైప్ సెలక్ట్ చేసుకొని ఐఫోన్‌లోకి బ‌దిలీ చేసుకోవ‌చ్చు.

Similar News

News October 5, 2024

దేశంలో సంపన్న రాష్ట్రాలు.. AP, TG స్థానాలివే

image

FY2024-25లో GSDP, GDP అంచనాల ప్రకారం ₹42.67 లక్షల కోట్లతో మహారాష్ట్ర దేశంలోనే రిచెస్ట్ స్టేట్‌గా నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు(₹31.55L cr), కర్ణాటక(₹28.09L cr), గుజరాత్(₹27.9L cr), UP(₹24.99L cr), బెంగాల్(₹18.8L cr), రాజస్థాన్(₹17.8L cr), TG(₹16.5L cr), AP(₹15.89L cr), MP(₹15.22L cr) ఉన్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా, బాలీవుడ్‌కు కేంద్రంగా ఉండటం, భారీ పరిశ్రమల కారణంగా MH టాప్‌లో ఉంది.

News October 5, 2024

బాధ్యతలు చేపట్టిన కార్పొరేషన్ ఛైర్మన్లు

image

AP: రాష్ట్రంలో వివిధ సంస్థల ఛైర్మన్లు ఇవాళ అమరావతిలో తమ బాధ్యతలు చేపట్టారు. మారిటైమ్ బోర్డు ఛైర్మన్‌-దామచర్ల సత్య, పర్యాటక శాఖ ఛైర్మన్-నూకసాని బాలాజీ, ఏపీఐఐసీ ఛైర్మన్-మంతెన రామరాజు బాధ్యతలు తీసుకున్నారు. వీరికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.

News October 5, 2024

నటి నాలుగో పెళ్లి వార్తలు.. అవన్నీ సినిమా స్టంట్స్

image

తమిళ నటి వనిత విజయకుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె తాను కొరియోగ్రాఫర్ రాబర్ట్‌ను <<14242143>>వివాహం<<>> చేసుకుంటాననే అర్థంలో కొన్ని రోజుల కిందట ఫొటో షేర్ చేసింది. అయితే అదంతా సినిమా ప్రమోషన్లలో భాగమని ఇవాళ ఆమె చేసిన పోస్టుతో తేలిపోయింది. స్వీయ దర్శకత్వంలో మిసెస్&మిస్టర్ చిత్రం పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ అవుతుందని వెల్లడించారు.