News July 10, 2024
సామాన్యులు రిలీజ్ ‘సినిమా’ చూసేదెలా?

TG, APలో పెద్ద సినిమాలు రిలీజైన వారం వరకు టికెట్ రేట్ల <<13602234>>పెంపునకు<<>> ప్రభుత్వాలు అనుమతించడంపై పలువురు అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. ప్రతీ సినిమాకు రేట్లు పెంచుకుంటే పోతే తాము అంతంత డబ్బులు పెట్టి ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని మూవీలకు ఫిక్స్డ్ టికెట్ ధరలు ఖరారు చేయాలని కోరుతున్నారు. ఇటీవల ‘కల్కి’, ఇప్పుడు ‘భారతీయుడు-2’కి రేట్లు పెంచారని గుర్తు చేస్తున్నారు.
Similar News
News November 20, 2025
BSNL.. రూ.2,399కే ఏడాదంతా..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే ఏడాది రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్నట్లు పేర్కొంది. రూ.2,399తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు రోజుకు 2GB డేటా, 100 SMSలు, అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేసింది. కాగా జియో, ఎయిర్టెల్ ఏడాది ప్లాన్స్ రూ.3,500కు పైగానే ఉన్నాయి. అయితే BSNL నెట్వర్క్ మెరుగుపడాలని, అది సరిగా లేకుంటే ఎన్ని ఆఫర్లు ఇచ్చినా లాభం లేదని యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.
News November 20, 2025
KTRను ప్రాసిక్యూట్ చేసేందుకు పర్మిషన్.. వివరాలు ఇవే!

TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు ACB గతంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ 4 సార్లు ACB విచారణకు హాజరయ్యారు. డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ రికార్డులు కలెక్ట్ చేసింది. దీనిపై KTRను ప్రాసిక్యూట్ చేసేందుకు సెప్టెంబర్లో ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరగా ఇప్పుడు <<18337628>>పర్మిషన్<<>> ఇచ్చారు.
News November 20, 2025
‘వారణాసి’ కథ ఇదేనా?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’కి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. కథ ఇదేనంటూ ‘Letterboxd’లో పోస్ట్ చేసిన synopsis వైరల్ అవుతోంది. ‘వారణాసిని ఒక గ్రహశకలం ఢీకొన్నప్పుడు అది ఎలాంటి ఘటనలకు దారి తీస్తుంది. ప్రపంచం నాశనం అవుతుందా? దీన్ని ఆపేందుకు ఖండాలు, కాలక్రమాలను దాటాల్సిన రక్షకుడు అవసరమా?’ అని అందులో ఉంది. ఈ టైమ్ ట్రావెల్ కథలో మహేశ్ 2 పాత్రల్లో కనిపిస్తారని చర్చ సాగుతోంది.


