News July 10, 2024

సామాన్యులు రిలీజ్ ‘సినిమా’ చూసేదెలా?

image

TG, APలో పెద్ద సినిమాలు రిలీజైన వారం వరకు టికెట్ రేట్ల <<13602234>>పెంపునకు<<>> ప్రభుత్వాలు అనుమతించడంపై పలువురు అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. ప్రతీ సినిమాకు రేట్లు పెంచుకుంటే పోతే తాము అంతంత డబ్బులు పెట్టి ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని మూవీలకు ఫిక్స్‌డ్ టికెట్ ధరలు ఖరారు చేయాలని కోరుతున్నారు. ఇటీవల ‘కల్కి’, ఇప్పుడు ‘భారతీయుడు-2’కి రేట్లు పెంచారని గుర్తు చేస్తున్నారు.

Similar News

News October 8, 2024

కాంగ్రెస్‌తో పొత్తు ఎన్సీకి క‌లిసొచ్చింది

image

JKలో కాంగ్రెస్‌తో పొత్తు NCకి క‌లిసొచ్చింది. ఆర్టిక‌ల్ 370 స‌హా రాష్ట్ర హోదా పున‌రుద్ధ‌రణపై ప్ర‌జ‌ల‌కు NC హామీ ఇచ్చింది. ఈ హామీల అమ‌లు స్థానిక ప్ర‌భుత్వ ప‌రిధిలో లేని అంశాలు. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల ఎప్ప‌టికైనా NC వీటిని అమ‌లు చేయ‌వ‌చ్చ‌ని ప్రజలు భావించినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కశ్మీర్‌లో కూటమి మెజారిటీ సాధించింది. అయితే, ఆర్టికల్ 370 పునరుద్ధరణపై కాంగ్రెస్ ఎన్నడూ స్పందించలేదు.

News October 8, 2024

నాగార్జున పిటిషన్ నిలబడదనుకుంటున్నాం: సురేఖ తరఫు లాయర్

image

మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో నిలబడేలా లేదని ఆమె తరఫు న్యాయవాది తిరుపతి వర్మ అన్నారు. ‘ఈ కేసు విచారణలో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాల్లో తేడాలు ఉన్నాయి. నాగార్జున పిటిషన్‌లో ఒకటి, వాంగ్మూలంలో మరొకటి చెప్పారు. ఆయన కోడలు సుప్రియ ఇంకొకటి చెబుతున్నారు. మరో సాక్షి వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేస్తుంది. ఒకవేళ నోటీసులు వస్తే చట్టపరంగా ఎదుర్కొంటాం’ అని ఆయన చెప్పారు.

News October 8, 2024

జమ్మూకశ్మీర్‌లో ఈ ఎన్నికలు ప్రత్యేకం: మోదీ

image

JKలో ఆర్టిక‌ల్ 370, 35(A) ర‌ద్దు త‌రువాత మొద‌టిసారిగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లు ఎంతో ప్ర‌త్యేకం అని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. భారీగా న‌మోదైన ఓటింగ్‌ ప్ర‌జాస్వామ్యంపై ప్ర‌జ‌ల విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించింద‌న్నారు. పార్టీ ప‌నితీరుపై హ‌ర్షం వ్య‌క్తం చేసిన మోదీ ఓటువేసిన వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. JK ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిరంత‌రం ప‌ని చేస్తామ‌న్నారు. మెరుగైన ఫ‌లితాలు సాధించిన NCని అభినందించారు.