News January 26, 2025
అది షో ఆఫ్ ఎలా అవుతుంది?: ఊర్వశీ రౌతేలా

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి మాట్లాడే సమయంలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తన ఆభరణాల గురించి మాట్లాడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఊర్వశీ స్పందించారు. ‘సైఫ్‌పై దాడి విషయాలు నాకు అంతగా తెలియవు. నాకు తెలిసినంత వరకు చెప్పా. అదే సమయంలో నాకు బహుమతిగా వచ్చిన కానుకల గురించి చెప్పా. ఇది ఏమాత్రం షో ఆఫ్ కాదు. అదే నిజమైతే నా చేతికి ఉన్న చిన్న వాచ్‌ను కూడా చూపించేదాన్ని’ అని చెప్పారు.
Similar News
News February 8, 2025
కాంగ్రెస్ దుస్థితి: జీరో, జీరో.. మరో జీరో లోడింగ్!

ఢిల్లీ అసెంబ్లీకి 1952-2020 మధ్య ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4సార్లు గెలిచింది. అలాంటి పార్టీ ఇప్పుడు అక్కడ ఖాతా తెరవడానికి ఆపసోపాలు పడుతోంది. 2015, 2020 ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఈసారీ పేలవ ప్రదర్శన చేస్తోంది. కేవలం ఒకేఒక్కచోట స్వల్ప ఆధిక్యతతో ఊగిసలాడుతోంది. పూర్తి కౌంటింగ్ ముగిసే సమయానికి ఆ స్థానమూ డౌటేనని అంచనా. దీంతో హ్యాట్రిక్ డకౌట్ ఖాయంగా కనిపిస్తోంది.
News February 8, 2025
27 ఏళ్ల బీజేపీ కరవు తీర్చిన ₹12L ట్యాక్స్ మినహాయింపు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కమలం గెలుపు దాదాపు ఖాయమేనని విశ్లేషకుల అంచనా. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు మిడిల్ క్లాస్‌ను బీజేపీ వైపు తిప్పిందని పేర్కొంటున్నారు. అలాగే పదేళ్ల ఆప్ పాలనపై వ్యతిరేకత, కాంగ్రెస్ ఓట్లు చీల్చడం కూడా కలిసొచ్చిందని చెబుతున్నారు.
News February 8, 2025
అలాంటి ఇంటి పట్టాల రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: YCP హయాంలో ఇంటి పట్టాలు పొందిన అనర్హులను గుర్తించి రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులకు కారు ఉందా? కుటుంబంలో ఎక్కువ మంది పట్టాలు పొందారా? తదితర వివరాలు సేకరించాలని పేర్కొంది. కాగా జగన్ ప్రభుత్వంలో 22.80L మందికి ఇంటిస్థలాలు ఇచ్చారు. వీరిలో 15.71L మందికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మిగిలిన 7L మందిలోనే అనర్హులు ఉన్నట్లు సమాచారం.