News September 28, 2024
నోట్ల చలామణీ 1976, 2024లో ఎలా ఉందంటే?

RBI లెక్కల ప్రకారం 1976 మార్చి 31 నాటికి దేశంలో చలామణీలో ఉన్న నగదు మొత్తం రూ.7,144 కోట్లు. ఇందులో రూ.87.91 కోట్ల విలువైన రూ.1,000 నోట్లు, రూ.22.90 కోట్ల విలువైన రూ.5వేల నోట్లు ఉండేవి. రూ.10వేల నోట్లను 1,260 మాత్రమే ముద్రించారు. వీటి విలువ రూ.1.26 కోట్లు. దేశం మొత్తం కరెన్సీలో రూ.5,000, రూ.10,000 నోట్ల వాటా కేవలం 2 శాతం లోపే. ప్రస్తుతం దేశంలో చలామణీలో ఉన్న నగదు రూ.34.90 లక్షల కోట్లు.
Similar News
News October 14, 2025
అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు!

ఎవరికైనా ఫ్రెండ్స్ అంటే చాలామందే ఉంటారు. కానీ, బెస్ట్ ఫ్రెండ్ అనగానే ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు. మీరు నవ్వితే వాళ్లు నవ్వుతారు, మీరు ఏడిస్తే ఓదారుస్తారు, మీరు గెలిస్తే వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు, మీకు కష్టమొస్తే వాళ్లు అడ్డంగా నిలబడిపోతారు. ఎవరి లైఫ్లోనైనా అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు. మీ జీవితంలో గెలిచారని చెప్పొచ్చు. మరి అలాంటి ట్రూ ఫ్రెండ్ మీ లైఫ్లోనూ ఉన్నారా? కామెంట్ చేయండి.
News October 14, 2025
బత్తాయి, నిమ్మ: OCTలో చేపట్టాల్సిన చర్యలివే..

అక్టోబర్లో బత్తాయి, నిమ్మ తోటల్లో కాయలు ఉన్న చెట్లకు తేలికపాటి తడి ఇవ్వాలి. శిలీంధ్ర వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు కాండంపై బోర్డో పేస్టును పూసుకోవాలి. పిందె, కాయలు రాలడాన్ని నివారించడానికి 100గ్రా. కార్బండిజమ్, 1KG యూరియాను 100L నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. నల్లి నివారణకు నీటిలో కరిగే గంధకాన్ని లీటరు నీటికి 3గ్రా. చొప్పున కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.
News October 14, 2025
సత్యం వైపు మార్గం చూపేదే ‘వేదం’

భగవంతుడు సత్య స్వరూపుడు. శాశ్వతుడు. కానీ ఈ జగత్తు అశాశ్వతం. సత్యమైన దేవుడే ఈ మిథ్యా లోకాన్ని సృష్టించాడు. ఈ అశాశ్వతమైన జీవులందరికీ ముక్తి ప్రసాదించి, తనలో శాశ్వతంగా ఐక్యం చేసుకోవడమే భగవంతుడి అంతిమ లక్ష్యం. జీవులు తిరిగి సత్యం వైపు పయనించడానికి, శాశ్వత స్థితిని పొందడానికి అవసరమైన దేవ మార్గాన్ని(మోక్ష మార్గాన్ని) స్పష్టంగా తెలియజేసేదే వేదం. అందుకే వేదమే సృష్టి ప్రయోజనాన్ని వివరిస్తుంది. <<-se>>#VedikVibes<<>>