News November 7, 2024
ఆ 4 దేశాలను ట్రంప్ ఎలా హ్యాండిల్ చేస్తారో?
USను శత్రువుగా భావించే దేశాల్లో నార్త్ కొరియా, ఇరాన్, రష్యా, చైనా ముందువరుసలో ఉంటాయి. కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఈ దేశాలను ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా యుద్ధాలకు ముగింపు పలికేందుకు ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు అందించే సాయాన్ని కుదించి, రష్యా, ఇరాన్‌తో ఉద్రిక్తతలకు బ్రేక్ వేస్తారని అంచనా. చైనా, నార్త్ కొరియాతో ద్వైపాక్షిక చర్చలు కొనసాగిస్తారని తెలుస్తోంది.
Similar News
News December 2, 2024
హైదరాబాద్‌లో భారీ వర్షం
TG: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సుచిత్ర, కొంపల్లి తదితర ప్రాంతాల్లో వాన పడింది.
News December 2, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 2, 2024
1500 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు: అనిత
AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో 1500 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నామని విశాఖలో క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మాట్లాడారు. భూకబ్జాలు, ఆక్రమణలు అరికట్టడంపై తాము స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఇందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.