News May 9, 2024
ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టివేత
AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీగా నగదు పట్టుబడింది. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ.8.39 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. పైపుల లోడ్ లారీలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు నగదు తరలిస్తుండగా సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Similar News
News January 7, 2025
hMPV: ఆంక్షలు విధించిన తొలి జిల్లా
హ్యూమన్ మెటాన్యూమోవైరస్ కేసులతో నీలగిరి జిల్లా (TN) అప్రమత్తమైంది. కర్ణాటక, కేరళ సరిహద్దులున్న ఈ జిల్లాలో ఊటీ సహా పలు పర్యాటక ప్రాంతాలున్నాయి. దీంతో ప్రజల, పర్యాటకుల భద్రత దృష్ట్యా ఫ్లూ లక్షణాలున్న వారు మాస్కు ధరించడాన్ని కలెక్టర్ తన్నీరు లక్ష్మీభవ్య తప్పనిసరి చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సర్వైలెన్స్ టీమ్‌లను రంగంలోకి దింపడంతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులతో తనిఖీలు చేస్తామన్నారు.
News January 7, 2025
ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం
AP: ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇవాళ నెట్ వర్క్ ఆసుపత్రులతో అధికారులు సమావేశమయ్యారు. ఏప్రిల్ 1 నుంచి బీమా పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవ అందించాలని డిసైడ్ చేశారు. మరోవైపు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
News January 7, 2025
గిల్‌కు అంత సీన్ లేదు: మాజీ సెలక్టర్
శుభ్‌మన్ గిల్ ఓ ఓవర్‌రేటెడ్ క్రికెటర్ అని, ఆయనకు భారత్ అన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నా మాట ఎవరూ వినలేదు. గిల్‌కు అంత సీన్ లేదు. అతడి బదులు సూర్యకుమార్, రుతురాజ్, సాయి సుదర్శన్ వంటి వారిని ప్రోత్సహించాలి. ప్రతిభావంతులకు బదులు గిల్‌కు ఛాన్సులిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.