News December 11, 2024
చైనాలో విజయ్ మూవీకి భారీ కలెక్షన్లు
విజయ్ సేతుపతి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘మహారాజ’ చైనా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ 12 రోజుల్లోనే దాదాపు 70 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో 2018లో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తర్వాత చైనాలో అత్యధిక కలెక్షన్లు చేసిన చిత్రంగా నిలిచింది. తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం.
Similar News
News January 24, 2025
విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టులో VSR పిటిషన్
AP: విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అనుమతి కోరారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలకు సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు ఈ నెల 27కి విచారణను వాయిదా వేసింది. కాగా రాజకీయాలు వీడుతున్నట్లు VSR ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 24, 2025
వీటిని రాత్రి నానబెట్టి తింటే..
అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి ఉదయం తింటే అనేక లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. తేనెతో కలిపి పరగడుపున తింటే జీర్ణశక్తి మెరుగవుతుంది. ఇందులోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. మహిళల్లో వచ్చే హార్మోన్ సమస్యలను తగ్గిస్తాయి. రక్త సరఫరా పెరుగుతుంది. గుండెపోటు రాకుండా ఉండేందుకు ఇందులోని పోషకాలు సహాయపడతాయి.
News January 24, 2025
చిరంజీవితో అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ తీస్తారు: నిర్మాత
విజయ పరంపర కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ‘లైలా’ చిత్రం ఈవెంట్‌లో దీనిపై నిర్మాత సాహు గారపాటి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవితో అనిల్ తీయబోయే సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం. ఇది ఎమోషన్స్‌తో కూడిన కథ. ఈ మూవీ విజయంతో అనిల్ రావిపూడి కెరీర్‌లో ట్రిపుల్ హ్యాట్రిక్ ఖాయం’ అని తెలిపారు.