News August 11, 2024
టీటీడీకి రూ.21 కోట్ల భారీ విరాళం

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పంజాబ్కు చెందిన భక్తులు రూ.21కోట్ల భారీ విరాళం అందించారు. ట్రైడెంట్ గ్రూపునకు చెందిన రాజిందర్ గుప్తా ఈ చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్యకు తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో అందించారు. కాగా టీటీడీకి చెందిన ప్రాణదాన ట్రస్ట్ ద్వారా పేదలకు గుండె, కిడ్నీ, బ్రెయిన్, క్యాన్సర్ వ్యాధులకు ఉచితంగా వైద్యం అందుతుంది.
Similar News
News November 22, 2025
సూర్యాపేట: ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ కృషి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డు జంక్షన్ను ఆయన ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాంతో కలిసి పరిశీలించారు. ప్రతి వాహనదారుడి భద్రత ముఖ్యమన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రజలు సైతం రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్పీ నరసింహ కోరారు.
News November 22, 2025
నిటారుగా ఉండే కొండ దారి ‘అళుదా మేడు’

అయ్యప్ప స్వాములు అళుదా నదిలో స్నానమాచరించిన తర్వాత ఓ నిటారైన కొండ ఎక్కుతారు. ఇది సుమారు 5KM ఉంటుంది. ఎత్తైన గుండ్రాళ్లతో కూడిన ఈ దారి యాత్రికులకు కఠినమైన పరీక్ష పెడుతుంది. పైగా ఇక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఎక్కువగా ఉండదు. స్వామివారి నామస్మరణతో మాత్రమే ఈ నిట్టనిలువు దారిని అధిగమించగలరని నమ్ముతారు. ఈ మార్గాన్ని దాటితేనే యాత్రలో ముఖ్యమైన ఘట్టం పూర్తవుతుందట. <<-se>>#AyyappaMala<<>>
News November 22, 2025
వరికి మానిపండు తెగులు ముప్పు

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.


