News August 11, 2024
టీటీడీకి రూ.21 కోట్ల భారీ విరాళం
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పంజాబ్‌కు చెందిన భక్తులు రూ.21కోట్ల భారీ విరాళం అందించారు. ట్రైడెంట్ గ్రూపునకు చెందిన రాజిందర్ గుప్తా ఈ చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్యకు తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో అందించారు. కాగా టీటీడీకి చెందిన ప్రాణదాన ట్రస్ట్ ద్వారా పేదలకు గుండె, కిడ్నీ, బ్రెయిన్, క్యాన్సర్ వ్యాధులకు ఉచితంగా వైద్యం అందుతుంది.
Similar News
News September 8, 2024
జింబాబ్వేకు భారత్ సాయం
ఆకలి కోరల్లో చిక్కుకుపోయిన జింబాబ్వేకు మానవతా సాయంతో భారత్ సాయం చేసింది. ఆ దేశంతోపాటు జాంబియా, మాలావికి కూడా ఆహారం పంపింది. 1,000 టన్నుల బియ్యం, 1,300 టన్నుల మొక్కజొన్నలు, ధాన్యాలు పంపింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. కాగా వర్షాల లేమితో తీవ్ర కరువు ఏర్పడి ఈ మూడు దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆహారం లేక చిన్నారులు అలమటిస్తుండటంతో భారత్ ఈ సాయం చేసింది.
News September 8, 2024
రూల్ ఆఫ్ లాపై బీజేపీకి నమ్మకం లేదు: రాహుల్
BJP పాలిత రాష్ట్రాల్లో చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన వారే వాటిని తుంగలో తొక్కుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. యూపీలో మంగేష్ యాదవ్ అనే యువకుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై ఆయన స్పందించారు. ఈ ఉదంతం రూల్ ఆఫ్ లాపై BJPకి నమ్మకం లేదన్న విషయాన్ని మరోసారి రుజువు చేసిందన్నారు. BJP ప్రభుత్వ హయాంలో STF వంటి దళం ‘క్రిమినల్ గ్యాంగ్’లా పనిచేస్తోందని విమర్శించారు.
News September 8, 2024
PARALYMPICS: భారత్ ఖాతాలో మరో స్వర్ణం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ F41 కేటగిరీ ఫైనల్‌లో నవదీప్ సింగ్ 47.32 మీటర్ల దూరం బల్లెం విసిరి విజేతగా నిలిచారు. ఇరాన్ జావెలిన్ త్రోయర్ సదేఘ్ 47.64 మీటర్లు విసిరినా నిర్వాహకులు ఆయన డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో రెండో స్థానంలో నిలిచిన నవదీప్‌ను గోల్డ్ మెడల్ విజేతగా ప్రకటించారు. కాగా భారత్ ఖాతాలో ఇప్పటివరకు 29 పతకాలు చేరాయి.