News August 4, 2024
రాష్ట్రంలో భారీగా పెరిగిన BSNL యూజర్లు
AP: ఇటీవల పలు టెలికం సంస్థలు రీఛార్జ్ ధరలు పెంచడంతో BSNL వైపు యూజర్లు మొగ్గు చూపుతున్నారు. నెల రోజుల వ్యవధిలో 2.17 లక్షల కొత్త కనెక్షన్లు రాగా ఆ సంస్థకు చెందిన మొత్తం కనెక్షన్ల సంఖ్య 40 లక్షలకు చేరింది. ఈ నెలాఖరులోగా 4జీ సేవలు అందుబాటులోకి రానుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా కనెక్షన్లు తీసుకుంటున్న వారు 45 రోజుల కాలపరిమితితో కూడిన రూ.249 రీఛార్జి ప్లాన్‌కే మొగ్గు చూపిస్తున్నారు.
Similar News
News September 19, 2024
జమిలి ఎన్నికలను వ్యతిరేకించిన CPI(M)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమిలి ఎన్నిక(ఒకే దేశం. ఒకే ఎన్నిక)ను వ్యతిరేకిస్తున్నట్లు CPI(M) ప్రకటించింది. ఇది BJP-RSS ఆలోచన అని ఆరోపించింది. ఈ జమిలి ఎన్నిక అమలైతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బ తింటుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ఫలితంగా ప్రజల ఓటు హక్కుకు విలువలేకుండా పోతుందని పేర్కొంది. కేంద్రం ఈ జమిలి ఎన్నికలకు నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
News September 19, 2024
ప్రభాస్ ‘ఫౌజీ’లో ఇద్దరు హీరోయిన్లు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మధురైలో ఏర్పాటు చేసిన సెట్‌లో ప్రభాస్ లేని సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా ఇప్పటికే ఫిక్స్ కాగా సెకండ్ హీరోయిన్ కూడా ఉందని, త్వరలోనే ప్రకటిస్తారని చెప్పాయి. ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
News September 19, 2024
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దుష్ప్రచారం: వైవీ సుబ్బారెడ్డి
AP: తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం <<14134836>>వ్యాఖ్యలను<<>> టీటీడీ మాజీ ఛైర్మెన్ సుబ్బారెడ్డి ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని పునరుద్ఘాటించారు. లడ్డూ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని చెప్పారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.