News November 11, 2024
భారీగా పెరిగిన ఉల్లి ధరలు

ఉల్లిధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వారం రోజుల క్రితం కేజీ రూ.50లోపు ఉన్న ధర ప్రస్తుతం రూ.70-80కి చేరింది. దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోనూ ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఉల్లి రేట్లు పెరగడంతో ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.
Similar News
News January 10, 2026
ప్రయాణికుల కోసం ప్రత్యేక చర్యలు: కోమటిరెడ్డి

TG: సంక్రాంతికి ఊరెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేశాం. పంతంగి టోల్ గేట్ వద్ద మాత్రమే కాస్త రద్దీ ఉంది. విజయవాడ హైవేపై ఆరు వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే నేషనల్ హైవే డైరెక్టర్‌తో మాట్లాడాం. అక్కడ యంత్రాలను కూడా తొలగించారు’ అని తెలిపారు.
News January 10, 2026
చెరకులో బడ్ చిప్ పద్ధతి వల్ల ప్రయోజనాలు

బడ్ చిప్ పద్ధతిలో పెంచిన చెరకులో సాంద్రపద్ధతి కంటే ఎక్కువ పిలకలు, ఏకరీతిగా ఎదుగుదల ఉండి.. గడల సంఖ్య, గడ బరువు, చెరకు దిగుబడి, చక్కెర శాతం అధికంగా ఉంటుంది. బడ్ చిప్ మొలకల ద్వారా నీరు, నమయం, కీలక వనరులను ఆదా చేయవచ్చు. ఎక్కువ దూరంలో మొలకలను నాటడం ద్వారా అంతర పంటలు వేసుకొని అదనవు ఆదాయం పొందవచ్చు. బడ్ చిప్ సేద్యంలో యాంత్రీకరణకు సౌకర్యంగా ఉండి, రైతులకు నికర ఆదాయం ఎక్కువగా రావటానికి అవకాశం ఉంటుంది.
News January 10, 2026
OFFICIAL: రాజాసాబ్‌కు ఫస్ట్ డే రూ.112 కోట్లు

ప్రభాస్-మారుతి కాంబోలో వచ్చిన రాజాసాబ్ తొలిరోజు కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఏకంగా ఈ మూవీ ఫస్ట్‌డే వరల్డ్ వైడ్‌గా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. హారర్ ఫాంటసీ కేటగిరీలో ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్ అంటూ ట్వీట్ చేసింది.


