News November 11, 2024
భారీగా పెరిగిన ఉల్లి ధరలు
ఉల్లిధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వారం రోజుల క్రితం కేజీ రూ.50లోపు ఉన్న ధర ప్రస్తుతం రూ.70-80కి చేరింది. దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోనూ ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఉల్లి రేట్లు పెరగడంతో ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.
Similar News
News December 7, 2024
బ్రిక్స్ కరెన్సీపై ప్రతిపాదనలు లేవు: జైశంకర్
US డాలర్‌తో పోటీ పడేందుకు బ్రిక్స్ దేశాల కొత్త కరెన్సీ తెచ్చే విషయమై నిర్ణయం తీసుకోలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. $ విలువ తగ్గింపుపై భారత్‌కు ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, బ్రిక్స్ కరెన్సీపై ఎలాంటి ప్రతిపాదనలు లేవన్నారు. కాగా బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీ తెస్తే 100% టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించారు.
News December 7, 2024
ఏటా డిసెంబర్ 15న ఆత్మార్పణ దినం
AP: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబర్ 15)ని ఏటా ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన జీవిత చరిత్రపై పిల్లలకు క్విజ్, వ్యాసరచనలో పోటీలు పెట్టాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
News December 7, 2024
GOOD NEWS: LIC స్కాలర్‌షిప్ స్కీమ్.. రేపటి నుంచి దరఖాస్తులు
టెన్త్/ఇంటర్/డిప్లొమాలో కనీసం 60% మార్కులు సాధించిన పేద విద్యార్థుల కోసం LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కీమ్‌ను లాంచ్ చేసింది. రేపటి నుంచి ఈనెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో పాసైన వారు, 2024-25లో ఫస్టియర్ చదువుతున్న వారు అర్హులు.
వెబ్‌సైట్: <