News June 4, 2024
ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ ఆధిక్యాలు..
➢మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి: 30876 ఓట్ల ఆధిక్యం
➢బాపట్లలో వేగేశన నరేంద్రవర్మ: 30978 ఓట్ల ఆధిక్యం
➢సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ: 24713 ఓట్ల ఆధిక్యం
➢పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర: 24819 ఓట్ల ఆధిక్యం ➢వేమూరు(ఎస్సీ)లో నక్కా ఆనందబాబు: 10810 ఓట్ల ఆధిక్యం ➢గుంటూరు వెస్ట్‌లో మహమ్మద్ నసీర్ అహ్మద్: 15582 ఓట్ల ఆధిక్యం ➢చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు: 11797 ఓట్ల ఆధిక్యం
Similar News
News November 14, 2024
శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో విషాదం నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్ అనే విద్యార్థి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం తోటి విద్యార్థులు నిద్రలేచి చూసేసరికి జస్వంత్ విగతజీవిగా కనిపించాడు. దీంతో కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులు సమాచారం అందించారు. మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.
News November 14, 2024
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. బులియన్ మార్కెట్‌లో వరుసగా నాలుగో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.75,650 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,100 తగ్గి రూ.69,350కి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,000 తగ్గి రూ.99,000లు పలుకుతోంది. గోల్డ్ 4 రోజుల్లో రూ.3,710, వెండి రూ.4,000 తగ్గడం విశేషం.
News November 14, 2024
జగన్.. మీకూ, మాకూ తేడా లేదు: షర్మిల
APలో ప్రభావం చూపలేని కాంగ్రెస్ గురించి చర్చ <<14602051>>అనవసరమన్న <<>>జగన్ వ్యాఖ్యలపై PCC చీఫ్ షర్మిల స్పందించారు. ‘బడ్జెట్ బాగోలేదని జగన్ కంటే ముందే చెప్పాం. 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనప్పుడు వాళ్లకు, మాకు తేడా లేదు. ఆ పార్టీకి ప్రజలు ఓట్లేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లండి. అప్పుడు ఎవరు ఇంపార్టెంటో తెలుస్తుంది’ అని సవాల్ విసిరారు.