News February 6, 2025
భారీగా ధర పతనం.. మిర్చి రైతుల కుదేలు
AP: అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి డిమాండ్ తగ్గడంతో రేటు భారీగా పతనమైంది. గత ఏడాది క్వింటా ₹35K పలికిన ధర ఇప్పుడు రకాన్ని బట్టి ₹10K-₹17K లోపే ఉంటోంది. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి. విత్తనం, పురుగుమందుల రేట్లు పెరగడం, కూలీల డిమాండ్ కారణంగా ఎకరాకు ₹3L ఖర్చవుతుంటే దిగుబడి 20-22 క్వింటాళ్లే వస్తోంది. దీంతో రైతులు కుదేలవుతున్నారు. ధర విషయంలో ప్రభుత్వం కలగజేసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News February 6, 2025
పాక్పై ఓడితే గుచ్చి గుచ్చి అడుగుతారు: రవి శాస్త్రి
భారత్-పాక్ మ్యాచ్ ప్రత్యేకమేమీ కాదని, అన్ని మ్యాచుల్లాగే దాన్నీ పరిగణిస్తామన్న కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘కోచ్గా ఉన్నప్పుడు నేనూ మీడియాకు ఇదే మాట చెప్పేవాడిని. కానీ నిజమేంటంటే పాక్పై గెలవడం చాలా కీలకం. ఆ జట్టుపై ఎన్ని మ్యాచులు గెలిచినా ఒక్క మ్యాచ్ ఓడితే చాలు పాతవన్నీ మర్చిపోయి ఓటమి గురించే అందరూ గుచ్చి గుచ్చి అడుగుతారు’ అని వ్యాఖ్యానించారు.
News February 6, 2025
Stock Markets: పెరిగిన డిఫెన్సివ్ స్టాక్స్
స్టాక్మార్కెట్లు మోస్తరు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం లేదు. బంగారం, డాలర్ ఇండెక్స్, US బాండ్ యీల్డులు పెరగడం అనిశ్చితిని సూచిస్తోంది. నిఫ్టీ 23,638 (-58), 78,102 (-163) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్కేర్ సూచీలు ఎగిశాయి. ఆటో, FMCG, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.
News February 6, 2025
సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేశారు.. వలసదారుల ఆవేదన
US నుంచి INDకు చేరుకున్న వలసదారులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఉన్నంతసేపు చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేశారని 36 ఏళ్ల జస్పాల్ సింగ్ వాపోయారు. అమృత్సర్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే వాటిని తీసేశారని చెప్పారు. అయితే వలసదారుల చేతులకు సంకెళ్లున్న ఫొటోలు వైరల్ కాగా కేంద్రంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. కానీ ఆ ఫొటోలు గ్వాటెమాల వలసదారులవని PIB ఫ్యాక్ట్చెక్ తెలిపింది.