News February 6, 2025
భారీగా ధర పతనం.. మిర్చి రైతుల కుదేలు

AP: అంతర్జాతీయ మార్కెట్‌లో మిర్చికి డిమాండ్ తగ్గడంతో రేటు భారీగా పతనమైంది. గత ఏడాది క్వింటా ₹35K పలికిన ధర ఇప్పుడు రకాన్ని బట్టి ₹10K-₹17K లోపే ఉంటోంది. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి. విత్తనం, పురుగుమందుల రేట్లు పెరగడం, కూలీల డిమాండ్ కారణంగా ఎకరాకు ₹3L ఖర్చవుతుంటే దిగుబడి 20-22 క్వింటాళ్లే వస్తోంది. దీంతో రైతులు కుదేలవుతున్నారు. ధర విషయంలో ప్రభుత్వం కలగజేసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News April 19, 2026
అల్లికలతో వ్యసనాలకు చెక్!

స్మోకింగ్, గోళ్లు కొరకడం, గంటల తరబడి మొబైల్ చూడటం వంటి వ్యసనాల నుంచి బయటపడటానికి అల్లికలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఖర్చుతో కూడిన థెరపీలు, కౌన్సెలింగ్‌లు అవసరం లేదంటున్నారు. ‘అల్లికలు అందంగా ఉండనక్కర్లేదు. చేతులు, కళ్ల కదలికల వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేటై శరీరం రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలూ తగ్గుతాయి’ అని పేర్కొంటున్నారు.
News April 19, 2026
పాక్‌లో భారీ భద్రత.. రెండో విడత చర్చల కోసమేనా?

US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా క్లారిటీ రాకపోయినా పాకిస్థాన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇస్లామాబాద్, రావల్పిండీ నగరాల్లో కఠిన ఆంక్షలు విధించింది. రావల్పిండీలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పార్కులు, బ్యాంకులు, షాప్స్, రెస్టారెంట్లను మూయించింది. 600 చెక్ పాయింట్లలో 10వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపింది.
News April 19, 2026
నగరడోన@45.4 డిగ్రీలు.. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు

ఇవాళ APలో ఎండలు బెంబేలెత్తించాయి. కర్నూలు(D) నగరడోనలో 45.4, కడప(D) ఖాజీపేటలో 44.5 డిగ్రీలు, చాలా చోట్ల 40 డిగ్రీల పై ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.


