News April 16, 2025
భారీగా తగ్గిన ధర.. కేజీ రూ.6!

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. మొన్నటి వరకు రూ.1800-రూ.2300 పలికిన క్వింటాల్ ఉల్లి.. ఇప్పుడు రూ.1300కు పడిపోయింది. కనిష్ఠంగా క్వింటాల్ ధర రూ.600 పలుకుతోంది. అంటే కేజీ రూ.6 మాత్రమే. పెట్టుబడి రావడం కూడా కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. అటు మార్కెట్లో కేజీ ఉల్లి ధర రూ.25-30గా ఉంది.
Similar News
News April 25, 2025
బెట్టింగ్ యాప్‌లపై విచారణ.. మెట్రో ఎండీకి నోటీసులు

TG: హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనలపై దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లను నిషేధించినా మెట్రో రైళ్లలో ప్రకటనలు రావడంపై కోర్టు మండిపడింది. ఆ ప్రకటనలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ మెట్రో ఎండీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి దర్యాప్తు జరగాల్సి ఉందని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
News April 25, 2025
నేడు ఢిల్లీకి సీఎం.. PMకు ‘అమరావతి’ ఆహ్వానం

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మే 2న అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆయన ఆహ్వానిస్తారు. సాయంత్రం తిరుగు ప్రయాణమై రాత్రి 9 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
News April 25, 2025
మరో సంచలన నిర్ణయం దిశగా భారత్?

ఉగ్రదాడి తర్వాత పాక్‌పై దౌత్యచర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. FEB 24, 2021న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయనున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఉగ్ర సంస్థలు కశ్మీర్లోకి చొరబడటంతోపాటు తరచూ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసి మన సైన్యానికి అదనపు బలం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.