News November 18, 2024

వేములవాడ అభివృద్ధికి భారీగా నిధుల విడుదల

image

TG: ఎల్లుండి సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో వేములవాడకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఆలయ అభివృద్ధి పనులకు రూ.127.65 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు ఆధునాతన సదుపాయాల కోసం రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూల వాగు బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ, భూసేకరణకు రూ.47.85 కోట్లు, స్థానికంగా మేజర్ డ్రైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొంది.

Similar News

News July 9, 2025

నెలకు రూ.1.23 లక్షల జీతం.. నోటిఫికేషన్ విడుదల

image

170 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 21-25 ఏళ్ల వయసు ఉండి డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్/12వ తరగతిలో కచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్ చదవి ఉండాలి. చివరి తేదీ జులై 23. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం పోస్టులను బట్టి నెలకు రూ.56,100 నుంచి రూ.1.23లక్షల వరకు ఉంది. https://joinindiancoastguard.cdac.in/

News July 9, 2025

యువీ ‘లక్ష్యం’ కోసం కదలిన తారలు

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఛారిటీ ‘YouWeCan’ కోసం క్రికెట్ సెలబ్రిటీలు తరలివచ్చారు. లండన్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సచిన్ టెండూల్కర్, అజిత్ అగార్కర్, కెవిన్ పీటర్సన్, రవిశాస్త్రి, విరాట్ కోహ్లీతోపాటు టీమ్ ఇండియా ఆటగాళ్లు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా క్యాన్సర్ రోగుల కోసం యువీ సామాజిక సేవ చేస్తున్న విషయం తెలిసిందే.

News July 9, 2025

APలో భారీ పెట్టుబడి: TDP

image

AP: దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ ప్లాంట్ రాష్ట్రంలో పెట్టేందుకు Syrma SGS Technology ముందుకొచ్చిందని టీడీపీ ట్వీట్ చేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద రూ.1800 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుందని, 2027 మార్చి కల్లా అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థతో ప్రభుత్వం చర్చలు జరిపిందని, చంద్రబాబు, లోకేశ్ కృషి ఫలించిందని వివరించింది.