News April 13, 2025
శ్రీశైలం హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. సెలవులతో పాటు జాతర చివరి రోజు కావడంతో తరలొస్తున్నారు. దీంతో శ్రీశైలం హైవేపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సిద్ధాపూర్ క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చైత్రపౌర్ణమి సందర్భంగా ఏటా మూడు రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య జాతర నిర్వహిస్తారు.
Similar News
News November 25, 2025
సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్

TG: కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఉ.11 గంటలకు సెక్రటేరియట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగంపై చర్చించనున్నారు. అటు సాయంత్రం 5 గంటలకు HYDలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ‘తెలంగాణ రైజింగ్-2047’పై సీఎం సమీక్ష నిర్వహిస్తారు.
News November 25, 2025
రూ.10 కోట్లు చెల్లించాలని విశాల్‌కు హైకోర్టు ఆదేశం

హీరో విశాల్‌ను రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అగ్రిమెంట్ ఉల్లంఘించి తన సినిమాలను లైకా ప్రొడక్షన్స్‌కు కాకుండా వేరే సంస్థకు విక్రయించినట్టు పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన కోర్టు రూ.21 కోట్లు 30% వడ్డీతో లైకాకు చెల్లించాలని తీర్పునిచ్చింది. విశాల్ దానిని సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.