News December 8, 2024
భారీగా తగ్గిన టికెట్ ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733651564036_1226-normal-WIFI.webp)
అల్లు అర్జున్ ‘పుష్ప-2’ టికెట్ల ధరలు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని – మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150-100 మేర తగ్గాయి. రేపటి నుంచి ఈ ధరలు అందుబాటులోకి రానున్నాయి. బుకింగ్ సైట్‌లలో తగ్గించిన ధరలు అందుబాటులో ఉన్నాయి. కాగా మూవీకి టికెట్ ధరలు భారీగా పెంచడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
Similar News
News January 20, 2025
Stock Markets: బ్యాంకు, ఫైనాన్స్ షేర్ల దూకుడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1726136832536-normal-WIFI.webp)
స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ట్రంప్ ప్రమాణం, డాలర్ దూకుడు, Q3 ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. SENSEX 76,775 (+151), NIFTY 23,231 (+28) వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా షేర్లకు డిమాండ్ ఉంది. ఆటో, FMCG, IT, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. KOTAK, WIPRO టాప్ గెయినర్స్.
News January 20, 2025
నాగ సాధువులు నగ్నంగా ఎందుకు ఉంటారు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737321929672_1226-normal-WIFI.webp)
నాగసాధువులు ఒంటిపై నూలు పోగు లేకుండా ఉంటారు. దీనికి కారణం వారు ఎలాంటి కోరికలు లేకుండా ఉండటమే. మనిషి ప్రపంచంలోకి నగ్నంగా వస్తాడని ఇదే సహజ స్థితి అని వారు నమ్ముతారు. ఈ భావనతోనే వారు దుస్తులు ధరించరని చెబుతారు. ప్రతికూల శక్తుల నుంచి రక్షించేందుకు పవిత్రమైనదిగా భావించే బూడిదను ఒంటికి పూసుకుంటారు. వారు చేసే సాధనలు, అభ్యాసాలతో ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొని జీవిస్తారు.
News January 20, 2025
అమెరికాలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రభంజనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737342693805_1226-normal-WIFI.webp)
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అమెరికాలో భారీగా కలెక్షన్లు రాబడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా $2 మిలియన్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. గతంలో లేని విధంగా పండగకు ప్రభంజనం సృష్టిస్తోందని తెలిపింది. మరోవైపు ఓవరాల్‌గా ఈ సినిమా కలెక్షన్లు రూ.200 కోట్లకు చేరువైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.