News September 27, 2024
కాల్ సెంటర్లు, మ్యారేజీ బ్యూరోల ద్వారా హ్యుమన్ ట్రాఫికింగ్: మంత్రి
AP: రాష్ట్రవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా పెరుగుతోందని హోం మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, మ్యారేజీ బ్యూరోల ముసుగులో ఆన్‌లైన్ ద్వారా ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. కాల్ సెంటర్లు ద్వారా కూడా విదేశాలకు హ్యుమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని చెప్పారు. ఇలాంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News October 6, 2024
ఇష్టమైన రంగు ద్వారా మీ పర్సనాలిటీ తెలుసుకోండి?
ఎరుపు రంగును ఇష్టపడేవారు దృఢంగా, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. బ్రౌన్ కలర్ ఇష్టమైన వారికి స్థిరత్వం, నమ్మకంగా ఉంటారు. గులాబీ రంగు ఇష్టపడేవారు అందరినీ సంతోషంగా ఉంచుతారు. ఆకుపచ్చ ఇష్టపడేవారు ప్రశాంతంగా ఉంటారు. పసుపు రంగు ఇష్టపడేవారు క్రియేటివ్‌గా ఉంటారు. తెలుపు ఇష్టపడేవారు స్వచ్ఛంగా ఉంటారు. నీలం రంగు ఇష్టపడేవారు సాదాసీదాగా ఉంటారు. నారింజ రంగు వారు ఏకాగ్రతతో ఉంటారు. నలుపును ఇష్టపడేవారు ఎవ్వరికీ అర్థం కారు.
News October 6, 2024
జనసంద్రమైన మెరీనా బీచ్(PHOTOS)
చెన్నైలో ఎయిర్‌షోకు ప్రజలు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో లక్షలాది మంది ఎయిర్‌షోను చూసేందుకు తరలివచ్చారు. దీంతో మెరీనా బీచ్ అంతా జనసంద్రమైంది. బీచ్‌కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. ఈక్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు.
News October 6, 2024
పాక్‌పై మరోసారి ఆధిపత్యం చాటిన భారత్
భారత మహిళల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును ఓడించింది. ఇరు జట్లు ఇప్పటివరకు మెగా టోర్నీల్లో 8 సార్లు తలపడి భారత్ 6 సార్లు గెలవగా, పాక్ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక ఓవరాల్‌గా దాయాదుల మధ్య 16 టీ20 మ్యాచులు జరగ్గా 13 భారత్, 3 పాక్ గెలిచింది.