News May 14, 2024
22 నెలల చిన్నారికి ₹17.5 కోట్ల ఇంజెక్షన్

రాజస్థాన్‌కు చెందిన హృదయాంశ్‌శర్మ(22 నెలలు) కోసం క్రికెటర్ నుంచి కూరగాయలమ్మే వ్యక్తి వరకూ కదిలి వచ్చారు. వెన్నెముక సమస్య ఉన్న చిన్నారి సాధారణ జీవితం గడపాలంటే ₹17.5 కోట్ల జోల్జెన్‌స్మా ఇంజెక్షన్ అవసరమైంది. చిన్నారి తండ్రి SI కావడంతో పోలీస్ విభాగం క్రౌడ్ ఫండింగ్ ప్రకటించింది. దీపక్ చాహర్, సోనూసూద్, NGOలు, సామాన్యులు సైతం విరాళాలిచ్చారు. ఎట్టకేలకు తాజాగా చిన్నారికి ఇంజెక్షన్ అందింది.
Similar News
News March 12, 2026
దారుణం: కాలేజీ అమ్మాయిల ఫొటోలు తీసి..

AP: ఏఐతో అద్భుతాలు చేయాల్సిన విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ బరితెగిస్తున్నారు. శ్రీకాకుళం(D) గురజాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా తోటి విద్యార్థినుల ఫొటోలు తీసిన కొందరు ఆకతాయిలు AIతో వాటిని అశ్లీలంగా మార్చారు. విషయం తెలియడంతో అమ్మాయిలు ఆందోళనకు దిగారు. నిందితులకు యాజమాన్యం TCలు ఇచ్చి పంపినట్లు సమాచారం.
News March 12, 2026
డొమెస్టిక్ సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్

TG: రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్‌కు కొరత లేదని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. హోటల్ పరిశ్రమకు LPG అవసరాలు తీర్చడం పెద్ద సమస్య అని పేర్కొన్నారు. రేపు గ్యాస్ కంపెనీలతో సమావేశమై పరిస్థితిపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సిలిండర్లు బ్లాక్ చేస్తే ఏజెన్సీలను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.
News March 12, 2026
క్యాప్ జెమినీ సీఈవోతో మంత్రి లోకేశ్ భేటీ

AP: విశాఖలో క్యాప్‌జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఎజత్‌తో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. సిటీలో ఆ సంస్థ పెట్టుబడులపైన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 20వేల ఉద్యోగాలు కల్పించేలా ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని సంస్థను లోకేశ్ కోరారు. భూకేటాయింపులపై ఇప్పటికే మధురవాడ ఐటీ పార్క్‌లో 20ఎకరాలు పరిశీలించగా.. అడవివరం, ఆనందపురంలోని భూములను కూడా ప్రతినిధులు పరిశీలించారు.


