News August 5, 2024

బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం: రేవంత్

image

తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో ఎన్ఆర్‌ఐల సహకారం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యూఎస్ పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో NRIలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం అయ్యాకా కుటుంబ పాలనలో పదేళ్ల దోపిడి కాదు.. వందేళ్ల విధ్వంసం జరిగిందని గ్రహించా. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించింది. వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాను’ అని తెలిపారు. అంతకుముందు ఆయనకు స్థానికంగా ఘనస్వాగతం లభించింది.

Similar News

News September 8, 2024

జింబాబ్వేకు భారత్ సాయం

image

ఆకలి కోరల్లో చిక్కుకుపోయిన జింబాబ్వేకు మానవతా సాయంతో భారత్ సాయం చేసింది. ఆ దేశంతోపాటు జాంబియా, మాలావికి కూడా ఆహారం పంపింది. 1,000 టన్నుల బియ్యం, 1,300 టన్నుల మొక్కజొన్నలు, ధాన్యాలు పంపింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ర‌ణ్‌ధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. కాగా వర్షాల లేమితో తీవ్ర కరువు ఏర్పడి ఈ మూడు దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆహారం లేక చిన్నారులు అలమటిస్తుండటంతో భారత్ ఈ సాయం చేసింది.

News September 8, 2024

రూల్ ఆఫ్ లాపై బీజేపీకి నమ్మకం లేదు: రాహుల్‌

image

BJP పాలిత రాష్ట్రాల్లో చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమ‌లు చేయాల్సిన వారే వాటిని తుంగ‌లో తొక్కుతున్నార‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. యూపీలో మంగేష్ యాద‌వ్ అనే యువ‌కుడిని పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేయడంపై ఆయ‌న స్పందించారు. ఈ ఉదంతం రూల్ ఆఫ్ లాపై BJPకి న‌మ్మ‌కం లేద‌న్న విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేసింద‌న్నారు. BJP ప్రభుత్వ హయాంలో STF వంటి దళం ‘క్రిమినల్ గ్యాంగ్’లా పనిచేస్తోందని విమ‌ర్శించారు.

News September 8, 2024

PARALYMPICS: భారత్ ఖాతాలో మరో స్వర్ణం

image

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ F41 కేటగిరీ ఫైనల్‌లో నవదీప్ సింగ్ 47.32 మీటర్ల దూరం బల్లెం విసిరి విజేతగా నిలిచారు. ఇరాన్ జావెలిన్ త్రోయర్ సదేఘ్ 47.64 మీటర్లు విసిరినా నిర్వాహకులు ఆయన డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో రెండో స్థానంలో నిలిచిన నవదీప్‌ను గోల్డ్ మెడల్ విజేతగా ప్రకటించారు. కాగా భారత్ ఖాతాలో ఇప్పటివరకు 29 పతకాలు చేరాయి.