News September 22, 2024
హిందువుల మనోభావాలను దెబ్బతీశారు: హీరో
తిరుమల లడ్డూ వ్యవహారంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం ఆందోళనకరం. ఇది లోపం కాదు. విశ్వాసాన్ని దెబ్బతీసినట్లే. హిందువులను అవమానపరిచారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉంది. సంప్రదాయాల ఉల్లంఘనలను సహించబోమని మనం ఒక ఉదాహరణగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 10, 2024
దువ్వాడతో నాది పవిత్ర బంధం: మాధురి
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో తనది పవిత్ర బంధం అని దివ్వెల మాధురి చెప్పారు. ప్రజలు తమ మధ్య సంబంధాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్రజా జీవితం వేరు.. రాజకీయాలు వేరు. రెండింటికీ ముడి పెట్టొద్దు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ది తప్పు కాకపోతే మాదీ తప్పు కాదు. ఇక్కడ ఎవరూ రాముడిలాగా ఏకపత్నీవ్రతులు లేరు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News October 10, 2024
మీకు తెలుసా.. ఈ జంతువులు సొంత పిల్లల్నే తినేస్తాయి!
జంతు ప్రపంచంలో నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. కొన్ని జంతువులు సొంత బిడ్డల్నే తినేస్తుంటాయి. తమకు పుట్టని పిల్లల్ని తినేసే మగసింహాలు, ఆహారం దొరక్క మాడిపోతున్న సమయంలో సొంత పిల్లల్ని తినేందుకు వెనుకాడవు. మొసళ్లు, మగ హిప్పోపొటమస్‌లు, చిట్టెలుకలు, ఆక్టోపస్‌లు, పీతలు, కొన్ని జాతుల పాములు కూడా కొన్నిసార్లు వాటి పిల్లల్ని అవే తినేస్తాయి. వినడానికి వింతగా ఉన్నా మనుగడ కోసం జంతు ప్రపంచంలో ఇది సహజమే.
News October 10, 2024
సెమీస్ రేసులోకి టీమ్ ఇండియా
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తు చేసి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 173 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో కవిషా దిల్హారి (21), అనుష్క సంజీవని (20) కాసేపు పోరాడారు. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి, ఆశా శోభన చెరో 3 వికెట్లతో లంకేయుల భరతం పట్టారు.