News March 30, 2024
బరాత్‌లో డాన్స్ చేయొద్దన్నందుకు భర్త ఆత్మహత్య

వివాహ వేడుకలో భార్య డాన్స్ చేయొద్దన్నందుకు మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి(D) చిన్నఆరేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో కూలీ పని చేసే అనిల్ దంపతులు స్వగ్రామం చిన్నఆరేపల్లిలోని బంధువుల పెళ్లికి వెళ్లారు. రాత్రి బరాత్‌లో డాన్స్ వెయ్యొద్దని భార్య చెప్పడంతో ఆవేశంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 20, 2025
ICMRలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ICMRలో 28 సైంటిస్ట్-B పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఎంబీబీఎస్ అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, CBT,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,ST,PWBD,మహిళలు, EWSలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.icmr.gov.in/
News December 20, 2025
‘రాయలసీమను ఉద్యానహబ్‌గా మార్చేందుకు నిధులివ్వండి’

AP: ఉద్యానహబ్‌గా రాయలసీమను మార్చేందుకు వచ్చే బడ్జెట్లో స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని.. కేంద్రం మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు కోరారు. ‘రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 93 క్లస్టర్లలో 18 ప్రధాన ఉద్యానపంటలు పండుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యానసాగును 2029 నాటికి 12.28 లక్షల హెక్టార్లకు పెంచేందుకు వచ్చే మూడేళ్లలో రూ.41 వేల కోట్లు అవసరం. దీనికి తగ్గట్లుగా 2026-27 బడ్జెట్లో నిధులివ్వండి’ అని కోరారు.
News December 20, 2025
ఏపీ టెట్ ‘కీ’ విడుదల

ఏపీ టెట్-2025 ప్రిలిమినరీ కీ విడుదలైంది. అభ్యర్థులు అధికారిక <


