News March 30, 2024

బరాత్‌లో డాన్స్ చేయొద్దన్నందుకు భర్త ఆత్మహత్య

image

వివాహ వేడుకలో భార్య డాన్స్ చేయొద్దన్నందుకు మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి(D) చిన్నఆరేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో కూలీ పని చేసే అనిల్ దంపతులు స్వగ్రామం చిన్నఆరేపల్లిలోని బంధువుల పెళ్లికి వెళ్లారు. రాత్రి బరాత్‌లో డాన్స్ వెయ్యొద్దని భార్య చెప్పడంతో ఆవేశంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 18, 2026

మార్కుల్లో తేడా వస్తే టీచర్‌కు ఫైన్!

image

AP: పదో తరగతి మూల్యాంకనంలో పొరపాట్లు జరగకుండా విద్యాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. రీకౌంటింగ్‌లో 5 కంటే ఎక్కువ మార్కుల తేడా వస్తే మూల్యాంకనం చేసిన టీచర్‌కు రూ.1500 నుంచి రూ.4000 వరకు ఫైన్ విధించనుంది. ఒక పేపర్‌ను తప్పకుండా 12 నిమిషాలు దిద్దాలనే నిబంధన పకడ్బందీగా అమలు చేయనుంది. గతేడాది వ్యాల్యూయేషన్‌లో భారీగా తప్పులు దొర్లడం, ఓ స్టూడెంట్‌కు ఏకంగా 30 మార్కులు తక్కువ వేయడం పెద్ద వివాదమైంది.

News February 18, 2026

ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా?

image

చర్మ ఆరోగ్యం కోసం ఫేస్ ప్యాక్స్ వాడటం మంచిదే కానీ వాటిని తరచూ వాడితే చర్మం పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. అలాగే మార్కెట్లో కొని వాడే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే ఆరిన వెంటనే శుభ్రం చెయ్యాలి. కొత్తరకం ఫేస్ ప్యాక్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ముఖం శుభ్రం చేసుకోకుండా ఫేస్ ప్యాక్‌ని అప్లై చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని గుర్తుంచుకోవాలి.

News February 18, 2026

ప్రకృతి సేద్యం.. APCNF ప్రధాన ఉద్దేశం ఇదే

image

వ్యవసాయాన్ని ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో, దీర్ఘకాలిక స్థిరత్వంతో సాగించే విధానంగా అభివృద్ధి చేయడమే APCNF లక్ష్యం. మొక్కకు కాదు, నేలకు ఆహారం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఇది ముందుకు సాగుతోంది. ఘన, ద్రవ జీవామృతం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, అగ్నాస్త్రం సహా ఇతర సహజ సూక్ష్మపోషకాలను పంటలకు అందిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు చేరువ చేయడంలో APCNF కీలకపాత్ర పోషిస్తోంది.