News November 23, 2024

ఆధిక్యంలో నటి భర్త

image

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో నటి, సింగర్ స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. అనుశక్తి నగర్ సెగ్మెంట్‌లో ఆయన సమీప ప్రత్యర్థి సనా మాలిక్(NCP)పై లీడింగ్‌లో కొనసాగుతున్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిలోని ఎన్సీపీ(శరద్ పవార్) నుంచి ఫహద్ పోటీ చేస్తున్నారు.

Similar News

News November 25, 2025

జనవరి నుంచి కొత్త డిస్కం.. నేడు నిర్ణయం

image

తెలంగాణలో జనవరి 2026లో కొత్త విద్యుత్ డిస్కం ఏర్పాటుపై ఈ మధ్యాహ్నం క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఇప్పటికే రూ.59,671 కోట్ల నష్టాల్లోని TGSPDCL, TGNPDCLలపై సబ్సిడీ సరఫరా భారం తగ్గనుంది. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్, పేదలకు 200 యూనిట్లు ఫ్రీ, మిషన్ భగీరథ & HYD వాటర్ బోర్డు కొత్త డిస్కంలో ఉంటాయి. దీంతో పాటు మరిన్ని విద్యుత్ సంస్కరణలు నేటి భేటీలో చర్చకు వస్తాయని సమాచారం.

News November 25, 2025

భారత్‌కు తొలి మహిళా వరల్డ్ స్నూకర్ టైటిల్

image

చెన్నైకి చెందిన 23 ఏళ్ల అనుపమ రామచంద్రన్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌గా అవతరించారు. చెన్నైలోని విద్యా మందిర్ స్కూల్‌లో చదివిన అనుపమ, ప్రస్తుతం ఎంఓపీ వైష్ణవ్ కాలేజీలో పబ్లిక్ పాలసీలో పీజీ చేస్తున్నారు. జూనియర్ స్థాయిలో 8 జాతీయ టైటిళ్లు, అమీ కమానీతో కలిసి 2023లో ఉమెన్స్ స్నూకర్ వరల్డ్ కప్, అండర్-21 ప్రపంచ టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నారు. మహిళల విభాగంలో భారత్‌కు ఇదే మొట్టమొదటి ప్రపంచ స్నూకర్ టైటిల్.

News November 25, 2025

పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 30పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<<-1>>పంజాబ్ <<>>& సింధ్ బ్యాంక్‌లో 30 MSME రిలేషన్‌షిప్ మేనేజర్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, ఎంబీఏ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.100. వెబ్‌సైట్: https://punjabandsind.bank.in