News November 23, 2024

ఆధిక్యంలో నటి భర్త

image

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో నటి, సింగర్ స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. అనుశక్తి నగర్ సెగ్మెంట్‌లో ఆయన సమీప ప్రత్యర్థి సనా మాలిక్(NCP)పై లీడింగ్‌లో కొనసాగుతున్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిలోని ఎన్సీపీ(శరద్ పవార్) నుంచి ఫహద్ పోటీ చేస్తున్నారు.

Similar News

News December 13, 2024

పుష్కరాల్లో భక్తులు పోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?: RGV

image

అల్లు అర్జున్ కేసుకు సంబంధించి పోలీసులకు RGV 4 ప్రశ్నలు వేశారు. ‘పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నేతలను అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్‌ను అరెస్ట్ చేస్తారా? భద్రత ఏర్పాట్లు పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు?’ అని ప్రశ్నించారు.

News December 13, 2024

డ్రామాలతో కాంగ్రెస్ డైవర్షన్ పాలన: బండి సంజయ్

image

అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్, మధ్యంతర బెయిల్ ఘటనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘ఇలా డ్రామాలు చేసి డైవర్షన్ పాలన సాగిస్తోందీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకప్పుడు తప్పుడు పాలన చేసి రాష్ట్రాన్ని దోచుకున్నవారు స్వేచ్ఛగా తిరుగుతుంటే, జాతీయ అవార్డు గ్రహీత నటుడిని మాత్రం అరెస్ట్ చేశారు. సెన్సేషనలిజం వారి అసమర్థతను దాచలేదు. కాంగ్రెస్ నాటకాన్ని దేశం మొత్తం చూసింది’ అని ఫైరయ్యారు.

News December 13, 2024

గ్రేట్.. రక్త దానం చేసి 24లక్షల మంది శిశువులకు ప్రాణం!

image

‘మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్’ అని పేరున్న జేమ్స్ హారిసన్ 60 ఏళ్లుగా వారానికోసారి రక్త దానం చేస్తూ ఇప్పటి వరకు 24 లక్షల మంది శిశువులను రక్షించారు. ఈయన రక్తంలో ప్రత్యేకమైన యాంటీబాడీలు ఉన్నాయి. 14 ఏళ్ల వయస్సులో ఆయన రక్తమార్పిడిలో యాంటీ-డీని గుర్తించారు. ఆయనను ఆస్ట్రేలియాలో నేషనల్ హీరోగా పిలుస్తుంటారు. హారిసన్ దాతృత్వానికి అనేక అవార్డులూ ఆయన్ను వరించాయి.