News April 4, 2026
HYDలో భారీగా పెరిగిన ధరలు

HYDలో రైస్ కుక్కర్లు, చోటా గ్యాస్ స్టవ్, సిలిండర్లు, ఇండక్షన్ స్టవ్, నాన్‌స్టిక్ సామగ్రి, ఎలక్ట్రిక్ హీటర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఉప్పల్, అత్తాపూర్, తార్నాక, ఎల్బీనగర్‌లో 2నెలలతో పోలిస్తే సుమారు 20% వరకు రేట్లను పెంచి విక్రయిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు స్టోర్లలో రైస్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ స్టవ్స్ స్టాక్ లేదు. LPG కొరతను వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని వాపోతున్నారు.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.