News May 4, 2024
HYD: దాహం వేస్తోందని వాటర్ బాటిల్ కొంటున్నారా..? జాగ్రత్త..!

వేసవి వేళ దాహం వేస్తోందని, HYDలో స్థానికంగా దొరికిన ఏదో ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసి, దాహం తీర్చుకునే వారిని అధికారులు హెచ్చరించారు. వేసవి డిమాండ్ను అదునుగా చేసుకొని కొంతమంది వేల సంఖ్యలో ఫేక్ వాటర్ బాటిల్స్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే గచ్చిబౌలి, నాంపల్లి తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఫేక్ వాటర్ బాటిల్స్ సీజ్ చేశారు. వాటర్ బాటిల్ కొనేటప్పుడు జర జాగ్రత్త..!
Similar News
News November 20, 2025
HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిపింది. ప్రతి స్టేషన్లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. ఫేస్మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.
News November 20, 2025
HYD: పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్

స్థానిక సంస్థల ఎన్నికల ముందే పోలీస్ శాఖలోని 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి ఆకాశ్ డిమాండ్ చేశారు. ఈరోజు సోమాజిగూడలో ఆయన మాట్లాడారు. ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను విస్మరించిందన్నారు. జీవో నంబర్ 46ను పూర్తిగా రద్దుచేసి, స్థానిక సంస్థల ఎన్నికలలోపు JOB నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు.
News November 20, 2025
HYD: రాజకీయాల్లో దిక్సూచి చుక్కా రామయ్య: KTR

చుక్కా రామయ్య 100వ జన్మదినం సందర్భంగా విద్యానగర్లోని ఆయన నివాసానికి మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. ఆయనను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. KTR మాట్లాడుతూ.. విద్యా ప్రదాత, తెలంగాణ పోరాటం, రాజకీయాల్లో దిక్సూచిగా చుక్కా రామయ్య తనదైన పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో BRS ఎమ్మెల్యేలు ఉన్నారు.


