News April 9, 2026
HYD: అలా అయితే మీ రేషన్‌కార్డ్ కట్!

TG విజిలెన్స్ విభాగం రహస్య ఆడిట్ చేసింది. PAN, GST నంబర్లను రేషన్‌కార్డు డేటాతో లింక్ చేస్తే HYDలో దాదాపు 2 లక్షల మంది IT చెల్లింపుదారులు బియ్యం కార్డులు కలిగి ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటికే 80% వెరిఫికేషన్ పూర్తైందని అంతర్గత సమాచారం. IT పేయర్స్, Govt ఉద్యోగుల కార్డులను AI సాఫ్ట్‌వేర్‌తో గుర్తించారు. వీటిని రద్దు చేయడం, గతంలో పొందిన సబ్సిడీని రికవరీ చేసేలా చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది.
Similar News
News April 14, 2026
ADB: పేకాటలో పట్టుబడ్డ కీలక నేతలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బీజేపీ నేత, భైంసా మున్సిపల్ ఛైర్మన్ దత్తాద్రి, ఆర్మూర్ కాంగ్రెస్ కౌన్సిలర్ వెంటకట్ గౌడ్ అలియాస్ రవి గౌడ్, పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. వారి నుంచి రూ.1.79లక్షల నగదు, 2కార్లు, 6 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు మంచి చెడ్డలు చెప్పేవారు ఇలా పట్టుబడటం చర్చనీయాంశమయ్యింది.
News April 14, 2026
కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే?

కామారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాల వివరాల ప్రకారం.. భిక్కనూర్‌లో అత్యధికంగా 42.9°C ఉష్ణోగ్రత నమోదైంది. బోమనదేవిపల్లి, సోమూర్, జుక్కల్ ప్రాంతాల్లో కూడా 42.8°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40°C నుంచి 43°C మధ్య నమోదవ్వడంతో ‘అలర్ట్’ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
News April 14, 2026
GNR: ఈ నెల 16 నుంచి స్వీయ నమోదు ప్రారంభం

గుంటూరు జిల్లాలో 15 ఏళ్ల తర్వాత జనగణన డిజిటల్ విధానంలో ప్రారంభం కానుంది. ఈ వారంలో భాగంగా 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు అవకాశం కల్పించారు. మొత్తం 33 ప్రశ్నలతో కుటుంబ వివరాలు నమోదు చేయాలి. పోర్టల్‌లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి సమాచారం ఇవ్వవచ్చు. మే 1 నుంచి గణకులు ఇంటింటికీ వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఆధార్ వంటి పత్రాలు అవసరం లేదు. వివరాల గోప్యతకు చట్ట పరిరక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు.


