News March 20, 2024
HYD: ఈ చిన్నారి GREAT

HYD చందానగర్ వాసి చార్విశ్రీ హుడాకాలనీలోని విద్యావాణి హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. యూట్యూబ్‌లో వీడియో చూసిన చిన్నారి క్యాన్సర్ రోగికి అవసరమయ్యే విగ్ కోసం తన జుట్టు ఇవ్వాలనుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు గోపాలకృష్ణమూర్తి, మంజూష సహకారంతో 25అంగుళాల పొడవున్న జుట్టును ఇటీవల HYD హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్ సంస్థకు అందించింది. ఈవయసులో చిన్నారి ఆలోచన ఆదర్శనీయమని స్థానికులు అభినందించారు.
Similar News
News October 22, 2025
మంజీరా నుంచి HYDకి కొత్త పైప్ లైన్

ఆరు దశాబ్దాల కిందటి మంజీరా పైప్‌లైన్ల నుంచి 20 శాతం నీరు లీకేజీల ద్వారా వృథా అవుతోంది. ఈ నీటి నష్టాన్ని అరికట్టడానికి జలమండలి సిద్ధమైంది. ఈ మేరకు రూ.722 కోట్ల వ్యయంతో కొత్త పైప్‌లైన్ వేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆమోదం రాగానే పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.
News October 22, 2025
చర్లపల్లి – దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

పండుగల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, దానాపూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. అక్టోబరు 23, 28 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్ (07049), 24, 29 తేదీల్లో దానాపూర్ నుంచి చర్లపల్లి (07092) రైళ్లు నడుస్తాయి. అలాగే, 26న 07049, 27న 07050 నంబరు గల ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.
News October 22, 2025
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో నేడు సదర్ ఉత్సవ మేళా సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద ఉత్సవం జరగనున్న నేపథ్యంలో రామ్‌కోటి, లింగంపల్లి, బర్కత్‌పూరా, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనదారులు అసౌకర్యాన్ని నివారించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.