News January 25, 2026

HYD: ఓపెన్‌లో PG, డిప్లొమా చేయాలనుకుంటున్నారా?

image

ఈ ఎడాదికి సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో ఓపెన్ పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్‌లకు సంబంధించిన వివిధ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య పద్మప్రియ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు sprtu.softelsolutions.in, www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో మార్చి 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని, వివరాలకు 73306 23411 ఫోన్ చేయాలన్నారు.

Similar News

News February 4, 2026

RR: మున్సిపల్ బరిలో 437 మంది అభ్యర్థులు

image

మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.126 వార్డుల్లో మొత్తం 615 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో 178 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో 437 మంది అభ్యర్థులు ఉన్నారు. అందులో కాంగ్రెస్ 126, బీఆర్ఎస్ 122, బీజేపీ 109, బీఎస్పీ 3, CPI(M) 2, MIM 1, AIFB2, సీపీఐ 2, జనసేన 9, ఇండిపెండెంట్ 57, ఇతరులు నలుగురు బరిలో ఉన్నారు.

News February 3, 2026

200 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు: రంగారెడ్డి కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 200 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులు 84,301 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 70,171 మంది పరీక్షలకు హాజరవుతారన్నారన్నారు. విద్యార్థులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సమన్వయంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News February 3, 2026

​ట్రెసా క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

image

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయ్స్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) 2026 నూతన క్యాలెండర్, డైరీని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్వో సంగీతతోపాటు ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు జనార్దన్ఋ‌రావు పాల్గొన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.