News May 20, 2024

HYD మెట్రో ట్రయల్ రన్.. టైమింగ్స్ మార్పు.!

image

HYD మెట్రో సమయ పాలనలో మార్పులు చేసేందుకు ముందస్తుగా ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారాల్లో మొదటి ట్రైన్ ఉదయం 5:30 గంటలకు, శుక్రవారాల్లో లాస్ట్ ట్రైన్ రాత్రి 11:45 గంటలకు మెట్రో సర్వీస్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని, సాధ్య సాధ్యాలను పరిశీలించిన అనంతరం మాత్రమే దీనిని శాశ్వతంగా కొనసాగిస్తామని HYD మెట్రో X వేదికగా తెలిపింది.

Similar News

News February 3, 2026

​ట్రెసా క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

image

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయ్స్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) 2026 నూతన క్యాలెండర్, డైరీని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్వో సంగీతతోపాటు ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు జనార్దన్ఋ‌రావు పాల్గొన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

News February 2, 2026

రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, పరీక్షల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పారదర్శకంగా పనులు పూర్తి చేయాలన్నారు.

News February 1, 2026

రంగారెడ్డి: నూతన సర్పంచుల శిక్షణా షెడ్యూల్‌లో మార్పులు

image

ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచుల శిక్షణా తరగతుల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మున్సిపాల్ ఎన్నికల కారణంగా కొత్త షెడ్యూల్ విడుదలైంది. మూడో విడత శిక్షణ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు, నాల్గో విడత ట్రైనింగ్ మార్చి 2 నుంచి 7 వరకు, ఐదో విడత శిక్షణ మార్చి 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. అప్పటివరకు సర్పంచులు గ్రామాభివృద్ధి పనుల్లో నిమగ్నం కావాలన్నారు.