News April 9, 2026
HYD: మెట్రో రూట్ మ్యాప్‌లో మార్పులు!

HYD మెట్రో 2వ దశ విస్తరణలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేవలం ప్యాసింజర్ డెన్సిటీ ఆధారంగా పాత రూట్లను మార్చినట్లు అంతర్గత నివేదికలు చెబుతున్నాయి. విమానాశ్రయ మార్గంలో కొన్ని స్టేషన్లను తగ్గించి, ఐటీ కారిడార్ వెలుపల ఉన్న ఫ్యూచర్ సిటీ వైపు మళ్లించే ప్లాన్ సిద్ధమైంది. ఈ సమాచారం బయటకు రాకముందే అక్కడ భూముల లావాదేవీలు జరగకుండా ప్రభుత్వం రిస్ట్రిక్టెడ్ జోన్ GOలను రహస్యంగా సిద్ధం చేస్తోందని సమాచారం.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.