News July 25, 2024

HYD రైల్వే స్టేషన్‌లో భద్రాద్రి జిల్లా వాసి మృతి

image

మౌలాలి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడు మృతి చెందాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల వివరాల ప్రకారం..భద్రాది జిల్లా పాల్వంచ వాసి షేక్ మహ్మద్ HYDలో ఉంటూ.. ఓ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా సొంతూరికి వెళ్దామని సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చాడు. కాకతీయ ఎక్స్‌ప్రెస్‌కు బదులు చెన్నై ట్రైన్ ఎక్కాడు. పొరపాటు తెలుసుకొని మౌలాలిలో రైల్‌ నుంచి దిగబోయాడు. ఒక్కసారిగా కింద పడిపోవడంతో‌ మృతి చెందాడు.

Similar News

News January 2, 2026

ఖమ్మంలో త్వరలో ‘హరిత’ హోటల్.. స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

image

ఖమ్మం జిల్లాకు వచ్చే పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం హరిత హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించారు. పర్యాటకులకు నాణ్యమైన భోజనం, విడిది సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని వసతులతో కూడిన అనువైన స్థలాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని పేర్కొన్నారు.

News January 2, 2026

‘పొలం బాట’తో రైతుల విద్యుత్ కష్టాలకు చెక్: ఎస్‌ఈ

image

అన్నదాతల విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘పొలం బాట’ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస చారి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 557 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, వేలాడుతున్న వైర్లు మరియు వంగిన స్తంభాలను సరిచేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎత్తైన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ గద్దెలను ఏర్పాటు చేశామన్నారు.

News January 2, 2026

స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి

image

పెనుబల్లి మండలం గణేశ్ పాడు సమీపంలో స్కూల్ బస్సు బోల్తా ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిమితికి మించి స్కూల్ బస్సులో విద్యార్థులను తీసుకెళ్లడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.