News September 12, 2025
HYD: వీధిలో చెత్త వేస్తున్నారా..? ALERT

HYD వీధులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడంతో తలెత్తే సమస్యలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా రెండు రోడ్లు, ప్రార్థన స్థలాలు ఉన్నచోట్ల ఈ చర్యలు చేపడుతున్నారు. చెత్త వేస్తున్న వారిపై కేసు నమోదు చేయనున్నారు. ఇందుకోసం సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఈ విధానం ప్రధానంగా వెస్ట్, సౌత్, సౌత్ వెస్ట్ జోన్లలో అమలు చేస్తున్నారు. దీంతో అవాంఛనీయ ఘటనలకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు.
Similar News
News September 12, 2025
అప్పులు ఆంధ్రాలో మాత్రమే పెరగలేదు: బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు పెరిగాయని జనరలైజ్డ్‌గా మాట్లాడటం సరికాదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గడచిన పదేళ్లలో కేంద్రం సహా చాలా రాష్ట్రాల్లో అప్పులు పెరిగాయని Way2News కాన్‌క్లేవ్‌లో వెల్లడించారు. అప్పటి కరోనా సహా ఇతర పరిస్థితులతో సరైన ఉపాధి, ఆదాయ అవకాశాలు లేవని తెలిపారు. ఇక విభజన తర్వాత చాలా కీలకమైన మొదటి 5 సంవత్సరాలు ఏ పనినీ సరిగా చేయలేకపోయారని ఆరోపించారు.
News September 12, 2025
VIRAL: ‘మిరాయ్’లో ప్రభాస్ లుక్‌పై క్లారిటీ!

తేజా సజ్జ ‘మిరాయ్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే ఈ చిత్రంలో చివర్లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం SMలో జోరుగా సాగింది. చాలా మంది రాముడి లుక్‌లో ఉన్న ప్రభాస్ ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే ఇదంతా ఏఐ ద్వారా ఎడిట్ చేసిన ఫొటో అని గ్రోక్‌తో పాటు సినిమా చూసినవారు చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ మాత్రమే ఇచ్చినట్లు క్లారిటీ ఇస్తున్నారు.
News September 12, 2025
పాడేరు: 12 నుంచి హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి

పర్యాటకులకు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ పేర్కొన్నారు. శుక్రవారం పీవో ఛాంబర్‌లో హాట్ ఎయిర్ బెలూన్ డిజిటల్ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. మెగా ఈగల్ ఫ్లై సంస్థ ఆధ్వర్యంలో 12 నుంచి పర్యాటకులకు పద్మాపురం గార్డెన్‌లో దీన్ని అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఇందులో పర్యాటకులు విహరించవచ్చని అన్నారు.