News March 30, 2026
HYD: సిటీలో కొత్త ట్రెండ్

పాతబస్తీ గల్లీల నుంచి హైటెక్స్ వరకు హైదరాబాద్ యువత ఫ్యాషన్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. టైట్ ఫిట్టింగ్ బట్టలు వదిలేసి కంఫర్ట్‌గా ఉండే ‘ఓవర్ సైజ్’ టీషర్టులు, లూజ్ కార్గో ప్యాంట్లతో కుర్రాళ్లు రచ్చ చేస్తున్నారు. పాతకాలం నాటి వింటేజ్ లుక్, విభిన్నమైన థ్రిఫ్ట్ స్టోర్ దుస్తులు, స్నీకర్లు, క్రాస్ బాడీ బ్యాగులతో సిటీ వీధుల్లో యువత తమదైన స్టైల్‌తో హల్చల్ చేస్తోంది. నగరంలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.