News August 12, 2025
HYD: 19 నుంచి పరీక్షలు

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సెమిస్టర్-2 పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ విడుదల చేసింది. UG, PG చదువుతున్న విద్యార్థులకు ఈనెల 19 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఉ.11:00 నుంచి మ.2:00 వరకు నాంపల్లి, బాచుపల్లి, వరంగల్ క్యాంపస్‌లో పరీక్షలు జరగనున్నాయి. శ్రీశైలం, రాజమండ్రి, కూచిపూడి క్యాంపస్ విద్యార్థులకు బ్యాక్ లాక్ పరీక్షలు హైదరాబాద్‌లోని బాచుపల్లి క్యాంపస్‌లో నిర్వహించనున్నారు.
Similar News
News April 15, 2026
HYD: ఇంటర్ మెమోల్లో తప్పులా? సరిచేసుకోండిలా!

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యార్థులకు సూచనలు చేసింది. మెమోల్లో విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, మార్కుల వంటి వాటిలో తప్పులు దొర్లితే వెంటనే సరిచేసుకోవాలని సూచించింది. ఈ సవరణల కోసం విద్యార్థులకు 10 రోజుల గడువు ఇచ్చింది. కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించి అవసరమైన పత్రాలను ఇచ్చి సవరణలు చేసుకోవచ్చని, లేదా నేరుగా <<8096958096>>హెల్ప్ డెస్క్‌ను<<>> వాట్సాప్‌లో సంప్రదించాలని తెలిపింది.
News April 15, 2026
నేడు వరంగల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వరంగల్ మహానగరంలో బుధవారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓ సిటీలో వీధి వ్యాపారులను సన్మానించి టీ స్టాళ్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం 3 గంటలకు ఓ ప్రైవేట్ హోటల్‌లో మీడియా సమావేశం, 4 గంటలకు 44వ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు హనుమకొండ వేయిస్తంభాల ఆలయం నుంచి మహిళా మోర్చా బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు.
News April 15, 2026
CBSE టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడు?.. విద్యార్థుల ఎదురుచూపులు

సీబీఎస్‌ఈ టెన్త్ రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిన్నే విడుదల అవుతాయని జాతీయ మీడియాలో ప్రచారం జరగడంతో అధికారిక వెబ్‌సైట్‌ను పదేపదే చెక్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. రిజల్ట్స్‌పై కచ్చితమైన డేట్ అండ్ టైమ్ ప్రకటించాలని విద్యార్థులు, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.


