News March 18, 2024
HYD: శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు

మాదాపూర్లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం కళారాధన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువు డా.తాళ్లపాక సందీప్ కుమార్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించారు. పుష్పాంజలి, మూషిక వాహన, ముద్దుగారే యశోద, శివతాండవం, మహాగణపతి, కాలభైరవాష్టకం, జయము జయం,అన్నమాచార్య కీర్తనలు, కళాపూజ, జగన్మోహన, దుర్గ స్తుతి, అభంగ్ మొదలైన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
Similar News
News November 28, 2025
21 మందిని అరెస్టు చేసిన సైబర్ పోలీసులు

వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. వీరిలో 13 ట్రేడింగ్ ఫ్రాడ్స్, మిగతా వారిని డిజిటల్ అరెస్ట్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు వీరిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా దాదాపు 49 కేసుల్లో బాధితులకు రూ.89.7 లక్షలను తిరిగి ఇప్పించారు.
News November 28, 2025
HYD: రాత్రికి రాత్రే ఊరు మారిపోదు బ్రో..

మా ఊరు గ్రేటర్లో విలీనమైంది. ఇక అభివృద్ధి పరుగులు పెడుతుందని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ‘అనేక గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు విలీనం అవుతున్నా, ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాతే అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. రాత్రికి రాత్రే ఊరు దశ.. దిశ మారిపోదు. పస్తుతం ఉన్న మహానగరంలోనే సమస్యలున్నాయి. విలీనం తర్వాత కూడా ఉంటాయి’ అని శివారులో గుసగుసలు వినిపిస్తున్నాయి.
News November 28, 2025
HYD: విలీనానికి ముందు.. అసలు లెక్క తేలాలిగా?

జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రక్రియ సంపూర్ణం కావాలంటే చాలా లెక్కలు తేలాల్సి ఉంది. ఆయా మున్సిపాలిటీల ఆస్తులు, అప్పులు, ఆదాయవ్యయాలు, కరెంటు, వాటర్ బిల్లులు, పెండింగ్ బిల్లులు, భూముల వివరాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ తేలాలి. ముఖ్యంగా వివాద భూముల లెక్కలు తేలాలి. ఇక ఆస్తి పన్నులు ఎన్నున్నాయి. ఎంత రావాలి అనేది కూడా క్లియర్గా ఉండాలి. అంతేకాక ఉద్యోగుల వివరాలు.. ఇవన్నీ జీహెచ్ఎంసీకి సమర్పించాలి.


