News January 23, 2026
HYD: IT హబ్‌లో ‘సర్కారు’ కొలువు!

IT హబ్‌గా పేరుగాంచిన టీ-హబ్‌లో ఇకపై ఫైళ్ల సందడి కనిపించనుంది. స్టార్టప్‌లకు కేటాయించిన ఈ ఐకానిక్ బిల్డింగ్‌లోకి బేగంపేట డివిజనల్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీసు మారుతోంది. ప్రైవేటు భవనాల అద్దెల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంలో భాగంగా ఈ మార్పు జరుగుతోంది. ఇప్పటివరకు కార్పొరేట్ లుక్కుతో మెరిసిపోయే టీ-హబ్ వాతావరణం ఇకపై రెవెన్యూ అధికారుల రాకపోకలతో కళకళలాడనుంది.
Similar News
News February 2, 2026
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించండి: జిల్లా కలెక్టర్

ప్రజాసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. వాట్సాప్ ద్వారా వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో DRO వెంకటాచారితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 414 దరఖాస్తులు అందాయని, హౌసింగ్- 329, రెవెన్యూ- 57, ఇతర శాఖలకు 28 ఫిర్యాదులు వచ్చాయన్నారు. పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరిస్తామన్నారు.
News February 2, 2026
HYD: METROకు బోలెడు INCOME వస్తుందిలా..!

మెట్రో స్టేషన్లు ప్రయాణించడానికే కాదు గోడౌన్లుగా మారుతున్నాయి. Zomato, Zeptoవంటి కంపెనీలు స్టేషన్లలో ఖాళీగా ఉన్న ప్లేస్‌ను అద్దెకు తీసుకుంటున్నాయి. రాత్రిపూట ట్రైన్ల ద్వారానే సరకులను స్టేషన్లకు తరలిస్తారు. దీంతో మీరు ఆర్డర్ చేసిన <<19033043>>10 మినిట్స్‌లో<<>> మీ ఐటం డెలివర్ అవుతుంది. కాగా ఆ సరకంతా ట్రైన్ల ద్వారానే రవాణా జరుగుతుండటంతో రోడ్లపై పెద్ద ట్రక్కుల గోల తప్పుతుంది. తద్వారా METROకి బోలెడు INCOME వస్తుంది.
News February 2, 2026
ఆదాయం కోసం HYD METRO ఏం చేస్తుందంటే..?

ఆదాయం పెంచుకోవడానికి HYD మెట్రో వినూత్నమైన ప్రణాళికను అమలు చేస్తోంది. మెట్రో స్టేషన్లలోని ఖాళీ ప్రదేశాలను క్విక్ కామర్స్(Zomato, Zepto) వంటి కంపెనీలకు ‘డార్క్ స్టోర్స్’గా అద్దెకు ఇస్తోంది. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ తగ్గుతుంది. ఎందుకంటే డెలివరీ ఏజెంట్లు మెట్రో స్టేషన్ల నుంచే వస్తువులను సేకరిస్తారు. ప్రయాణీకులకు తెలియకుండానే స్టేషన్ల వెనకభాగం ఇప్పుడు లాజిస్టిక్స్ హబ్‌లుగా మారుతున్నాయి.


