News March 17, 2024

HYD: చిక్కడపల్లిలో వ్యక్తి దారుణ హత్య

image

HYD చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. శనివారం అర్ధరాత్రి ప్రధాన రహదారి ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న 67 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 22, 2025

HYD: Ibomma రవిని విచారించిన సీపీ

image

Ibomma రవి కేసులో మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన సైబర్ క్రైమ్ ఆఫీసుకు వెళ్లి రవిని విచారించారు. పైరసీ నెట్ వర్క్, బెట్టింగ్ యాప్‌లతో అతనికున్న సంబంధాలు, విదేశీ కార్యకలాపాల గురించి సీపీ ఆరా తీసినట్లు సమాచారం.

News November 22, 2025

HYD: లక్ష్య సాధనకు నిరంతర అధ్యయనం ముఖ్యం: కలెక్టర్

image

విద్యార్థులు లక్ష్య సాధనకు సిద్ధమై, నిరంతరం అధ్యయనం కొనసాగించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి అన్నారు. నారాయణగూడలోని రాజా బహుదూర్ వెంకటరామి రెడ్డి ఉమెన్స్ కాలేజీలో శనివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ అచ్యుతాదేవి, ప్రొఫెసర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News November 22, 2025

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమేనా?

image

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే MLA దానం నాగేందర్ AICC పెద్దలతో సమావేశమయ్యారు. అనర్హత అనివార్యమైతే పదవి వదులుకోవాల్సిందే. రాజీనామా చేస్తే MLA టికెట్ తనకే ఇవ్వాలని ఆయన AICCని కోరినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ టికెట్ కోసం ఆశావహులు ముందుకొస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశానని ఖైరతాబాద్ సీనియర్ లీడర్ రాజు యాదవ్ టికెట్ తనకే ఇవ్వాలని
సెంటర్‌లో బ్యానర్ కూడా పెట్టేశారు.