News March 17, 2024

HYD: చిక్కడపల్లిలో వ్యక్తి దారుణ హత్య

image

HYD చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. శనివారం అర్ధరాత్రి ప్రధాన రహదారి ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న 67 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 8, 2024

దసరా: హైదరాబాద్‌ను విడిచి ఊరెళ్లిపోతున్నారు!

image

దసరా పండుగతో నగరం ఖాళీ అవుతోంది. HYD ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు పట్టణం నుంచి పల్లెబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో MGBS, JBS, ఉప్పల్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News October 8, 2024

HYD: రూ.1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్

image

తెలంగాణలో బహిరంగ మార్కెట్లో ఎంఫిటమైన్ ముడి ధరలు కిలో రూ.1 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకూ పలుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిమాండ్‌ను బట్టి దళారులు ఈ ధరలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ముడి సరుకును ల్యాబ్‌కు తరలించి ఎండీఎం తయారీకి ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో ఎంఫిటమైన్ తయారీ చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి.

News October 7, 2024

HYD: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీరే..!

image

HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్ PS పరిధిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరి వివరాలు పోలీసులు తెలిపారు. షేక్ మదీనా (కుడి) బాషాTGRTCలో అసిస్టెంట్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అన్నోజు శ్రావణ కుమార చారి (ఎడమ) TKR కాలేజ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. మదీనా బాషా TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రావణ లిఫ్ట్ అడిగాడు. వీరి మరణవార్తతో కుటుంబపెద్దలను కోల్పోయామని వారు రోదిస్తున్నారు.