News March 16, 2024

HYD: మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు: గజ్జల నగేశ్

image

ఎమ్మెల్సీ కవిత అరెస్టు అప్రజాస్వామికమని తెలంగాణ మాజీ బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జల నగేశ్ అన్నారు. ఇది బీజేపీ కుట్రలో భాగమని, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతో కవితను అరెస్టు చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించనున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల్లో మనోస్థైర్యం దెబ్బతీసేందుకే కుట్రలు చేశారని, మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలని ఆయన మండిపడ్డారు.

Similar News

News April 10, 2026

ప్రత్యేక ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైళ్ల ఏర్పాటు

image

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 వరకు HYD నుంచి అయోధ్య, కాశీ, వైష్ణో దేవి, దక్షిణ భారతదేశ క్షేత్రాలను సందర్శించేలా 4 ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ టూర్లలో ప్రయాణం, హోటల్ వసతి, మూడు పూటలా భోజనం, గైడ్, భద్రతా సౌకర్యాలు కల్పిస్తుండగా, టికెట్ ధరలు రూ. 14,500 నుంచి రూ. 34,100 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల వారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

News April 8, 2026

ఆమనగల్లు: WOW.. వరి నాటుతున్న రాహుల్ గాంధీ, సీఎం

image

ఆమనగల్లు మండలం చింతలపల్లికి చెందిన చిత్రకారుడు రూపం వెంకట్‌రెడ్డి వేసిన చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైతు కుటుంబానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డికి రైతుల కష్టాలు తెలుసని, రైతు భరోసా పథకాన్ని రైతులందరికీ ఓకే సారీ అందించి ఆదుకోవాలని కోరుతూ రాహుల్ గాంధీ, సీఎం, రైతులతో కలిసి వరి నాటుతున్నట్లు చిత్రం రూపొందించారు. చిత్రకారుడి చిత్రాన్ని రైతులు స్వాగతిస్తూ హర్షిస్తున్నారు.

News April 5, 2026

రంగారెడ్డి: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ!

image

రంగారెడ్డి జిల్లా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు SBI RSETI సువర్ణావకాశం కల్పిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఏప్రిల్ 13 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య గల మహిళలు దీనికి అర్హులు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతితో పాటు కోర్సు పూర్తయ్యాక ఉచితంగా టూల్‌కిట్ అందిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 7981951167, 9963562266 నంబర్లలో సంప్రదించాలన్నారు.